పార్లమెంటులో రాష్ట్రపతి కీలక ప్రసంగం

 

      పార్లమెంటు ఉభయసభలు సోమవారం నాడు ప్రారంభం అయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి పార్లమెంటు సెంట్రల్ హాల్ లో ప్రసంగించారు. గతానికి భిన్నంగా ఈసారి కేంద్ర బడ్జెట్ ను ఫిబ్రవరి 1వ తేదీనే ప్రవేశపెట్టడంతో పాటుగా రైల్వే బడ్జెట్ ను, సాధారణ బడ్జెట్ ను ఓకేసారి కలిపి సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ప్రభుత్వ పనితీరును, కేపట్టబోయే ప్రణాళికలను వివరించారు.

రాష్ట్రపతి ప్రసంగంలోని ముఖ్యాంశాలు

 • ప్రజా ఉధ్యమంలా స్వచ్చభారత్ కార్యక్రమం
 • ప్రసూతి సెలవలు 12 నుండి 24 వారాలకు పెంపు
 • ప్రధాని కౌశల్ వికాస్ కార్యక్రమం ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు
 • కొత్తగా ఉద్యోగా సృష్టికి 6వేల కోట్లు
 • ఆరు శాతం పెరిగిన రబీ విస్తీర్ణం
 • 3.5 కోట్లకు పైగా రైతులకు భీమా సౌకర్యం
 • మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు కిందకు 12.7 లక్షల హెక్టార్లు
 • 20 కోట్ల మందికి రూపే కార్డులు, 26 కోట్ల జన్ ధన్ ఖాతాలు
 • ప్రతీ ఇంటికీ విద్యుత్ కోసం ప్రత్యేక పథకం
 • ఈశాన్య భారతదేశంలో పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
 • కొత్తగా 4 మెట్రలో ప్రాజెక్టులు, చెన్నై మెట్రో విస్తరణకు అనుమతి
 • దొంగనోట్లను అరికట్టడం, నల్లధనాన్ని రూపుమాపడం కోసం పెద్ద నోట్ల రద్దు
 • బినామీ ఆస్తుల చట్టానికి మెరుగులు
 • గ్రామీణ  ప్రాంతాల్లో విస్తారంగా రహదారి విస్తరణ పనులు
 • ఉగ్రవాదం పై ఉక్కుపాదం
 • సర్జికల్ దాడుల ద్వారా ఉగ్రవాదులకు గట్టి ముద్ది చెప్పాం.
 • తరచూ ఎన్నికలు రాకుండా రాష్ట్రాల శాసనసభలకు, లోక్ సభకు ఓకే సారి ఎన్నికలు జరగాలి, దీనిపై దేశవ్యాప్తంగా చర్చజరగాలి.
 • భారత్ నెట్ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా 70వేల గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం
 • మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *