సినీహోరో, జనసేన అధినేత పవన్ కళ్యాడ్ పై తెలుగు తమ్ముళ్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం కార్యకర్తలకు విపక్షనేత జగన్ కన్నా పవన్ కళ్యాణే ప్రధమ శత్రువుగా కనిపిస్తున్నట్టు ఉంది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశంపై జనసేనకు, తెలుగుదేశం పార్టీకి మధ్య చిచ్చుపెట్టినట్టు కనిపిస్తోంది. ఎన్నికల ముందు నుండి నిన్న మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ ను నెట్టిన పెట్టుకున్న తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు పవన్ పేరు చెప్తేనే మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ కు రాజకీయంలో ఓనామాలు తెలియవని విమర్శిస్తున్నారు. ప్రత్యేక హోదా వల్ల ఒచ్చే ప్రయోజనాలు ఏమిటో చెప్పాలని నిలదీస్తున్నారు. పనిలో పనిగా పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. దీనితో సామాజిక మాధ్యమాల్లో జోరుగా యుద్ధం నడుస్తోంది. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ను తమవాటిగా చెప్పుకున్న తెలుగుదేశం కార్యకర్తలు ఇప్పుడు ఆయనపై తీవ్ర అసనంతో ఉన్నారు.
జల్లికట్టు ఉధ్యమ తరహాలో ఆంధ్రప్రదశ్ లో ప్రత్యేక హోదా పోరాు సాగించాలని కొంత చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. ఈ ఉధ్యమానికి టీడీపీ, బీజేపీ మినహా ఇతర రాజకీయ పక్షాలు పూర్తిగా మద్దతు ప్రకటించినా ఎక్కడా ఆశించిన రీతిలో ప్రజల నుండి స్పందన కనిపించలేదు. పోలీసులు ఉధ్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేశాయని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ముఖ్యంగా జనసేన అధినేత ఎప్పటికప్పుడు ట్విటర్ లో చేసిన పోస్టులు రాజకీయప్రకంపనలు సృష్టించాయి. ప్రభుత్వ వైఖరిపై పవన్ కళ్యాణ్ తీవ్ర అసనం వ్యక్తం చేయగా ఇటు పవన్ పై తెలుగుదేశం వర్గాలు కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. పవన్ ను విమర్శించడంతో ఆచీతూచి వ్యవహరించిన తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు పంధా మార్చారు విమర్శలు ధాటిని పెంచడంతో పాటుగా పవన్ ను టార్గెట్ చేస్తూ గట్టిగానే పవన్ విమర్శలకు జవాబు చెప్తున్నారు.
రాజకీయంలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్నదాన్ని నిజం చేస్తూ పవన్ కళ్యాణ్-తెలుగుదేశం మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటోంది. ఎన్నికల్లో బీజేపీ-టీడీపీలకు మద్దతుగా ప్రచారం చేసిన పవన్ కళ్యణ్ అటు కేంద్ర ప్రభుత్వం పై కూడా తీవ్రంగానే మండిపడుతున్నారు. మోడీని సైతం వదలకుండా విమర్శల వర్షం కురిపిస్తున్నారు.