దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ గోవధను నిషేధించాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని కోర్టు కొట్టివేసింది. గోవధను నిషేధిస్తూ చట్టం తీసుకుని రావాలంటూ ఈ పిటీషన్ ను దాఖలు చేశారు. దేశంలో గోవులను పూజించే వారు ఉన్న నేపధ్యంలో గోవుల వధను ఆపాలని పిటీషన్ దారుడు కోర్టుకు విజ్ఞప్తి చేశాడు దీనిపై సుప్రీం కోర్టు ఆదేశాలు జారీచేసేందుకు నిరాకరించింది. ఇప్పటికే గోవుల అక్రమ రవాణాపై తాము ఇప్పటికే చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీచేసిన నేపధ్యంలో కొత్తగా గోవధ నిషేధంపై ఆదేశాలు జారీ చేసే అవకాశం లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.