మంచు తుపానుకు 6గురు సైనికులు బలి

జమ్మూకాశ్మీర్ లో భారిగా కురుస్తున్న మంచు ఆరుగురు సైనికులను బలితీసుకుంది. సోనామార్గ్ లోని ఆర్మీ క్యాంపుపై మంచుచరియలు విరిగి పడిన ఘటనలో ఆరుగురు జవాన్లు చనిపోయారు. మరో నలుగురికి గాయాలు అయ్యాయి. సైనిక క్యాంపు పై మంచుచరియలు విరిగి పడిన ఘటన రెండు రోజుల్లో ఇది రెెండవది. జమ్ము కాశ్మీర్ లో విపరీతంగా కురుస్తున్న మంచు ధాటికి కొండ చరియలు విరిగిపడుతున్నాయి. ఒక్కసారిగా ముంచెత్తున్న మంచు ఆర్మిక్యాంపులను కుప్పకూల్చింది. మంచు కింద పడిఉన్న మరో ఏడుగురు సైనికులను సహాయక బృందాలు రక్షించాయి. వాతావరణం ప్రతికూలంగా ఉండడంతో సహాయక చర్యలు చేపట్టడం కూడా కష్టం అవుతోంది. సైనిక స్థావరాలపై మంచు చరియలు విరిగి పడిన ఘటనలో ఇప్పటివరకు మూడు మృతదేహాలను వెలికితీశామని మరో మూడు మృతదేహాలను వెలికి తీయాల్సి ఉందని ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఈ దుర్ఘటనలో ఒక మేజర్ తో సహా ఆరుగురు మృతి చెందారని సాహయక చర్యలు కొనసాగుతున్నాయని ఆర్మీ వెల్లడించింది. ఒక్క సారిగా ముంచుకుని వస్తున్న మంచు తుపాను తాకిడి నుండి సురక్షిత ప్రాంతాలకు వెళ్లడం కూడా కష్టంగా మారిందని సైనికాధికారులు చెప్పారు. మరో వైపు ఇదే ప్రాంతంలో మంచుచరియల ధాటికి మూడు ఇళ్లు కుప్పకూలిన ఘటనలో నలుగురు పౌరులు చనిపోయారు. వాతావరణం అత్యంత క్లిష్టంగా ఉందని సైన్యం వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *