ప్రియాంక నవ్వే సమాధానం….

0
54

బీజేపీ నేత వినయ్ కతియార్ చేసిన వ్యాఖ్యల పట్ల ప్రియాంక గాంధీ స్పందించలేదు. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రియాంక గాంధీ ప్రచారం చేయనున్నాట్టు ఆ పార్టీ నెల్లడించిన వెంటనే దానిపై స్పందించిన బీజేపీ నేత ప్రియాంక పై విమర్శలు గుప్పించారు.  అందానికి ఓట్లు రాలవన్న కతియార్ తమ ప్రాచంరంలోనూ చాలా మంది అందగత్తెలు పాల్గొంటారని వారు ప్రియాంక కన్నా అందంగా ఉంటారంటూ వ్యాఖ్యానించారు. దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి. అయితే ప్రియాంక మాత్రం కతయార్ వ్యాఖ్యలను తేలిగ్గాతీసుకున్నారు. కతియార్ వ్యాఖ్యల గురించి మీడియా ప్రతినిధులు ప్రస్తావిస్తే చిరునవ్వు నవ్వేసి ఊరుకున్నారు. ప్రియాంక భర్త రాబర్డ్ వాధ్రా మాత్రం కతియార్ వ్యాఖ్యలపట్ల స్పందించారు. ఆయన విమర్శలు దురదృష్టకరమని బీజేపీ దీనికి సమాధానం చెప్పాలన్నారు. మహిళలపై విమర్శలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇటు బీజేపీ కూడా కతియార్ వ్యాఖ్యలను తప్పుబట్టింది. తమ పార్టీ నేత ప్రియాంక పై చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదవని ఆ పార్టీ అగ్రనేత, మంత్రి వెంకయ్యనాయుడు అన్నాడు. కతియార్ అటువంటి వ్యాఖ్యలు చేసి ఉంటాల్సింది కాదన్నారు. ప్రియాంక ప్రచారం చేసినంత మాత్రాన తాము భయపడేదిలేదని వెంకయ్య పేర్కొన్నారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here