విరాట్ కోహ్లీ…. క్రికెట్ అభిమానుల్లో ఈ పేరు తెలియని వారుండరు. అటు మైదానంలో ఇటు మైదానం బయట తనదైన దూకుడుతో ప్రేక్షకులను ఆకట్టుకునే భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తనకు వచ్చిన పద్మశ్రీ బిరుదు లభించడంపై ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అన్ని రకాల ఫార్మాట్ లలో తనదైన ముద్రను వేసుకున్న కోహ్లీ సంచలనాలకు మారుపేరుగా నిల్చాడు. తన దూకుడు వల్ల కెప్టెన్ గా పనికిరాడనే వారికి తన విజయాలతోనే సమాధానం చెప్పిన కోహ్లీ తన బ్యాటింగ్ ప్రతిభతో రికార్డులను దాసోహం అనిపించుకున్నాడు.