ఉగ్రవాదం పై ఉమ్మడి పోరాటం

 
ఉగ్రవాదం పై పోరుతో భారత్-అమెరికాలు కలసికట్టుగా పోరాడాలని నిర్ణయించాయి. అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోడీతో ఫోన్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పలు కీలక అంశాలను చర్చించారని అందులో ఉగ్రవాదం పై పోరుపై ప్రత్యేకంగా ఈ అగ్రనేతలు మాట్లాడారని వైట్ హౌస్ ఒక అధికారిక ప్రటనలో పేర్కొంది. అమెరికాను సందర్శించాల్సిందిగా ట్రంప్ మోడిని కోరగా భారత్ లో పర్యటించాలని మోడీ అమెరికా అధ్యక్షుడికి విజ్ఞప్తి చేశారు. రక్షణ, ఆర్థిక రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని ఇరు దేశాధినేతలు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ట్రంప్ భారత్ ను తమకు నిజమైన మిత్రుడిగా అభివర్ణించారు. భారత్ తో అన్ని రంగాల్లో కలిసి పనిచేయడానికి తమకు ఎటువంటి అభ్యంతరాలు లేవని ట్రంప్ పేర్కొన్నట్టు సమాచారం. ప్రపంచ వ్యాప్తంగా ఎదురవుతున్న సవాళ్లను అధికమించానికి ఇరు దేశాలు కలసికట్టుగా ముందుకు సాగాలని అభిలషించారు. ఉగ్రవాదం తో సహా అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వీరన్నారు. అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత ట్రంప్ వివిధ ప్రభుత్వాదినేతలతో స్వయంగా మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో ఆయన భారత ప్రధానితో ఫోన్ లో మాట్లాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *