తమిళ ఉధ్యమ స్పూర్తితో హోదా పోరాటం

ఆంధ్రప్రదేశ్ లో ప్ర్తతేయక హోదా ప్రకంపనలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. తమిళనాడులో జల్లికట్టును పోరాడి సాధించుకున్న తమిళ విద్యార్థుల స్పూర్తితో విశాఖపట్నం రామకృష్ణ బీచ్ వద్ద ప్రారంభ తలపెట్టిన మౌన ప్రదర్శన వివాదం రేపుతోంది. విద్యార్థుల ప్రదర్శనకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. చెన్నై మెరినా బీచ్ తరహాలో విశాఖలోనూ భారీ ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించేందుకు సమాయత్తం అవుతున్న వారిని నిలురించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే సమాజిక మాధ్యమాల్లో దీనిపై భారీగా ప్రచారం సాగుతోంది.
మరోవైపు ఈ నిరసన ప్రదర్శన పై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. జల్లికట్టు ఉధ్యమానికి ప్రత్యేక హోదా అంటూ చేయతలపెట్టిన నిరసన కార్యక్రమానికి తేడా ఉందని కొందరు అంటున్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థులను వాడుకుంటున్నారని వారు మండిపడుతున్నారు. హోదా కోసం ఉధ్యమం చేసే విధానం ఇదికాదని అంటున్నారు. అటు ఉధ్యమాన్ని సమర్థిస్తున్నవారు మాత్రం తాను వెనక్కితగ్గేది లేదని అంటున్నారు. జల్లికట్టు ఉధ్యమాన్ని స్పూర్తిగా తీసుకుంటే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. ఇటు ప్రత్యేక హోదా నిరసన కార్యక్రమానికి రాజకీయ మద్దతు కూడా తోడయింది. ఈ కార్యక్రమంలో తాను స్వయంగా పాల్గొంటానని విపక్ష నేత జగన్ స్పష్టం చేయగా ఈ కార్యక్రమానికు మద్దతు ప్రకటిస్తున్నట్టు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
ప్ర్తత్యేక హోదా కోసం జరపతలపెట్టిన మౌన ప్రదర్శనకు ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతి ఇచ్చేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. మెరినా బీచ్ కు విశాఖ ఆర్కే బీచ్ కు బౌగోళిక పరిస్థితుల్లోనూ తేడా ఉందని అక్కడ ఉన్నంత విశాలంగా ఇక్కడి బీచ్ ఉండదని పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడితే అనుకోని ప్రమాదాలు జరిగే ఆస్కారం కూడా ఉందని పోలీసులు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *