జాతి వ్యతిరేక శక్తులకు వేదికగా జల్లికట్టు ఉధ్యమం?

జల్లికట్టు ఉధ్యమం కట్టు తప్పింది. తమిళ సంస్కృతిపై జరుగుతున్న దాడిగా పేర్కొంటూ మొదలైన ఉధ్యమం వెర్రితలలు వేసింది. తమిళులుకు సహంజంగా తమ సంస్కృతి, సంప్రదాయాలపై  మక్కువ ఎక్కువ. తమిళ సంస్కృతికి విఘాతం కలిగించే ఎటువంటి చర్యనైనా వారు ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించరు. దీన్ని తప్పుపట్టాల్సిన అవసరం కూడా లేదు. గతంలో హిందీ వ్యతిరేక ఉధ్యమం నుండి నేటి జల్లికట్టు దాకా తమ సంస్కృతిపై జరుగుతున్న దాడిగా దేన్నైనా భావిస్తే దాని అంతుచూసే దాకా నిద్రపోని తత్వం తమిళులది. ఈ సెంటిమెంట్ మీద మొదలైన జల్లికట్టు ఉధ్యమం రూపం మార్చుకుంది. శాంతియుతంగా మొదలైన ఉధ్యమం శాంతిభద్రతలకు విఘాతం కలిగించే స్థాయికి చేరుకుంది. జల్లికట్టుకు అనుకూలంగా తమిళనాడు సర్కారు తీసుకుని వచ్చిన ఆర్డినెన్సు కూడా ఉధ్యమకారులను శాంతింపచేయలేదు. ఆఘమేగాల మీద అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి జల్లికట్టుకు అనుకులంగా బిల్లును ఆమోదించినప్పటికీ పరిస్థితుల్లో మార్పులేదు. దీనికి కారణం ఖచ్చితంగా తమిళ రాజకీయాలే అన్నది స్పష్టంగా కనిపిస్తోంది.
తమిళనాట జల్లికట్టుకు అనుకూలంగా మొదలైన ఉధ్యమాన్ని దేశ వ్యతిరేక శక్తులు హైజాక్ చేశాయా అనే అనుమానం  కలుగుతోంది. తమిళ సంస్కృతి పేరుతో విద్యార్థులు మొదలుపెట్టిన ఉధ్యమాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం కొన్ని స్వార్థ శక్తులు ఉపయోగించుకుంటున్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ ఉధ్యమంగా ఎల్టీటీటీఈ అధినేత ప్రభాకరన్ చిత్రపటాలు దర్శన మివ్వడం జాతీయ స్పూర్తికి విఘాతం కలిగించేలా అక్కడ కొంత మంది చేసిన నినాదాలు తప్పకుండా ప్రమాద సంకేతాలను ఇస్తోంది. కొంత మంది మరింత ముందుకు వెళ్లి జాతీయ పతాకాలను అవమానించే స్థాయికి వెళ్లిన తీరును చూస్తుంటే జల్లికట్టు ఉధ్యమంలోకి జాతి వ్యతిరేక శక్తులు ప్రవేశించాయని స్పష్టంగా కనిపిస్తోంది.
ద్రవిడ ఉధ్యమాలు, హింధీ వ్యతిరేక ఉధ్యమాలతో గతంలోనూ తమిళనాట జాతీయ సమగ్రతకు విఘాతం కలిగే ఘటనలు చాలానే జరిగాయి. అయితే రకరకాల కారణాలతో అవి తీవ్ర రూపం దాల్చకుండా పోయాయి. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే తిరిగి ప్రాంతీయ విధ్వేషాలను రెచ్చగొట్టి తమ పబ్బం గడుపుకునే చర్యలు మొదలయ్యాయని చెప్పవచ్చు. ఇటువంటి పరిణామాలను మొగ్గలోనే తుంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *