ఆగని ఆందోళనలు-జల్లికట్టు రద్దు

 
జల్లికట్టు ఆటను నిర్వహించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్సును తీసుకుని రావడంతో సమస్య పరిష్కారం అవుతుందని భావించిన తమిళనాడు సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆర్డినెన్సును తీసుకుని వచ్చి మధురైలో జల్లికట్టును స్వయంగా ప్రారంభించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ఈ కార్యక్రమాన్ని రద్దు చేయాల్సిన పరిస్థితులు ఏర్పాడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్సును తీసుకుని వచ్చినప్పటికీ తమళినాట ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాత్కాలికంగా జారీ చేసే ఆర్డినెన్సులు తమకు అవసరం లేదని శాశ్వత పరిష్కారం చూపాలంటూ తమిళనాడు ప్రజలు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. మధురైలో జల్లికట్టును ప్రారంభించేందుకు వచ్చిన పన్నీరు సెల్వంకు చేదు అనుభవం ఎదురైంది. అల్లంగానల్లూరు వద్ద జల్లికట్టును ప్రారంభించాలని వచ్చిన ముఖ్యమంత్రి గెస్ట్ హౌస్ నుండి కదిలే పరిస్థితి కలనిపించలేదు. గ్రామస్థుల  ఆందోళనలతో గ్రామం అట్టుడికింది. పెద్ద సంఖ్యలో వచ్చిన స్థానికులు నిరసన ప్రదర్శనకు దిగారు. రహదారులను దిగ్భందించారు. గ్రామస్థుల ఆందోళన తీవ్ర రూపం దాల్చడంతో మధురై జల్లికట్టును రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సులో ఈ సంవత్సరానికి మాత్రమే అనుమతి ఇచ్చినట్టు ఉండడంతో తమిళనాడులో ఆందోళనలు తీవ్రం అయ్యాయి. జల్లికట్టుపై తమకు శాశ్వత పరిష్కారం చూపించాల్సిందేనని ప్రజలు పట్టబడుతున్నారు.
అటు సుప్రీం కోర్టులో తమిళనాడు ప్రభుత్వం కేవియట్ పిటీషన్ ను దాఖలు చేసింది. జల్లికట్టును సుప్రీంకోర్టు నిషేధిస్తూ తీర్పు చెప్పిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా జల్లికట్టుకు అనుకూలంగా ఆందోళనలు ఉదృతం అయ్యాయి. తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన కేవియట్ పై సుప్రీం కోర్టు తన అభిప్రాయాన్ని చెప్పనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *