భారత సైనికుడిని విడిచిపెట్టిన పాక్

సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తూ దారితప్పి పాకిస్థాన్ భూబాగంలోకి వెళ్లిన భారత జవాన్ ను పాకిస్థాన్ తిరిగి భారత్ కు అప్పగించింది. గత సంవత్సరలం సెప్టెంబర్ 29న బాబులాల్ చవాన్ అనే 22 సంవత్సరాలు భారత సైనికుడు తన విధుల్లో భాగంగా సరిహద్దుల్లో కాపలా కాస్తున్నాడు. అయితే పొరపాటున చవాన్ పాకిస్థాన్ భూబాగంలోకి వెళ్లడంతో పాకిస్థాన్ సైన్యం అతన్ని తమ అదుపులోకి తీసుకుంది. అప్పటి నుండి పాకిస్థాన్ వద్ద బంధీగా ఉన్న చవాన్ ను విడిపించేందుకు బారత్ చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. తమ అదుపులో ఉన్న జవాన్ ను పాకిస్థాన్ సైనికులు విచారణ జరిపారు. పొరపాటన చవాన్ పాక్ భూబాగంలోకి వచ్చినట్టు గుర్తించిన పాకిస్థాన్ అతన్ని వాఘా సరిహద్దుల వద్ద భారత్ కు అప్పగించింది. చవాన్ ను పాకిస్థాన్ భారత్ కు అప్పగించడంతో అతని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన ఈ సైనికుడి నాయనమ్మ చవాన్ ను పాకిస్థాన్ సైనికులు అదుపులోకి తీసుకున్నారన్న వార్తతో గుండెపోటు తో చనిపోయింది. చందులాల్ ను విడుదల చేయడం పట్ల భారత్ హర్షం వ్యక్తం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *