శ్రీశైలం వద్ద "పప్పీసార్ "హత్య

దిల్ షుఖ్ నగర్ ప్రాంతంలో “పప్పీసార్” సుపరిచితుడైన ఉడుగు ప్రభాకర్ ను నయీం ముఠా హత్యచేసినట్టుగా తేలిపోయింది. 2003 అక్టోబర్ 12 నుండి కనిపించకుండా పోయిన ప్రభాకర్ ను నయీం ముఠా దిల్ షుఖ్ నగర్ ప్రాంతం నుండి కిడ్నాప్ చేసి శ్రీశైలం అడవుల్లో అత్యంత దారుణంగా హత్యచేసినట్టు పోలీసులు గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం 2003 అక్టోబర్ 12వ తేదీన నయీం ముఠా ప్రభాకర్ అలియాస్ పప్పీని దిల్ షుక్ నగర్ ప్రగతీ కాలేజీ సమీపంలో కిడ్నాప్ చేసింది. అంతకు ముందు రెండు రోజుల నుండి ప్రభాకర్ కదలికను గమనిస్తూ వచ్చిన నయీం అనుచరులు ఆయన ఏ సమయానికి కాలేజీకి వెళ్తున్నది ఎన్ని గంటలకు కాలేజీ నుండి బయటకు వస్తున్నాడు అన్న విషయాలను గమనిస్తూ సమయంకోసం వేచిచూసి 2003 అక్టోబర్ 12న కిడ్నాప్ చేశారు. దిల్ షుఖ్ నగర్ లోని సిద్దార్థా కాళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న ప్రభాకర్ పిఅండ్ టి కాలనీలో ట్యూషన్లు కూడా తీసుకునే వాడు. ప్రభాకర్ కదనికలను కనిపెట్టాల్సిందిగా నయీం శ్రీహరి అనే వ్యక్తికి బాధ్యతలు అప్పగించాడు. ఆరోజును శ్రీహరి చెప్పిన ఆనవాళ్ల ప్రకారం నయీం తో పాటుగా వాహనంలో ఉన్న ఇతర ముఠా సభ్యులు సాజిదా షాహిన్, సత్యనారాయణ, సుల్తానా, పురుషోత్తంలు ప్రగతీ కాలేజీ వద్ద నుండి ప్రభాకర్ ను కిడ్నాప్ చేశారు.
ప్రభాకర్ ను కిడ్నాప్ చేసిన నయీం ముఠా అతన్ని శ్రీశైలం వైపు తీసుకుని పోయింది. దారిలో ప్రభాకర్ సోదరికి ఫోన్ చేయించి తాను అత్యవసర పనిమీద వేరే ఊరికి వెళ్తున్నానని రెండు రోజుల తరువాత తిరిగివస్తానని తన కోసం ఎదురుచూడవద్దని బలవంతంగా చెప్పించారు. ప్రభాకర్ కుటుంబ సభ్యులను ఏమార్చడానికే ఆ విధంగా ఫోన్ చేయించిన నయీం ముఠా ప్రభాకర్ ను శ్రీశైలం అడవుల్లోకి తీసుకుని వెళ్లారు. అక్కడ ప్రభాకర్ మెడకు తాడుతో ఉరిబిగించి హత్య చేశారు. నయింతో పాటుగా ఇతర ముఠా సభ్యులు ఈ హత్యలో పాల్గొన్నారు. ప్రభాకర్ ను హత్యచేసిన తరువాత శవాన్ని అడవుల్లోని లోయలోకి విసిరేసి తిరిగి వెళ్లిపోయారు.
ఇటు ప్రభాకర్ కనిపించకుండా పోవడంతో ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసును నమోదు చేసుకున్న పోలీసులు ప్రభాకర్ కోసం గాలించిన ఫలితం లేకుండా పోయింది. నయీం ఎన్ కౌంటర్ తరువాత పట్టుబట్టు ముఠ సభ్యులు పోలీస్ ఇంటరాగేషన్ లో వెల్లగింటిన విషయాలను బట్టి పోలీసులు ప్రభాకర్ మిస్సింగ్ కేసును తిరగదోడారు. పోలీసులు మరింత లోతుగా విచారణ జరపడంతో ప్రభాకర్ హత్య విషయం వెలుగులోకి వచ్చింది. ప్రభాకర్ ను దిల్ షుఖ్ నగర్ ప్రాంతం నుండి కిడ్నాప్ చేసి శ్రీశైలం వద్ద హత్య చేసినట్టుగా నయీం ముఠా సభ్యులు అంగీకరించారు. కారులోనే తాడు సహాయంతో ప్రభాకర్ కు ఉరిబిగించి హత్య చేసినట్టు వారు ఒప్పుకున్నారు. గ్యాంగ్ స్టర్ నయీం ఈ హత్యను చేశాడని అతనికి తాము సహకరించామని వారు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో అంగీకరించారు.
     నయీం ప్రభాకర్ ను ఎందుకు హత్య చేశాడు అన్న వివరాలు త్వరలో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *