అసద్ వివాదాస్పద వ్యాఖ్యలు

హైదరాబాద్ లోక్ సభ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జల్లికట్టుపై తమిళనాడులో వ్యక్తమౌతున్న ఆందోళనలకు ఉమ్మడి పౌరస్మృతితో ముడిపెడుతూ అసద్ టిట్వర్ లో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. రకరకాల ప్రజలు ఉన్న భారత్ లో ఉమ్మడి పౌరస్మృతి లాంటివి సాధ్యంకాదని వ్యాఖ్యానించారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన సంప్రదాయలు, సంస్కృతులు ఉన్న భారత దేశంలో ఉమ్మడి పౌరస్మృతిని తీసుకుని రావడానికి హింధు శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. తమిళనాడు ఘటన ఇటువంటి వారికి చెంపపెట్టు అని అసద్ వ్యాఖ్యానించారు. ప్రజల సంస్కృతి సంప్రదాయలను పరిగణలోకి తీసుకోకుండా చట్టాలు రుద్దుతున్నారనడానికి జల్లికట్టు వివాదం ఉదాహరణ అని చెప్పారు. తమిళ ప్రజలపై బలవంతంగా చట్టాలను రుద్దుతున్నట్టే ముస్లీంల పైనా బలవంతంగా చట్టాలను రుద్దే ప్రయత్నాలను చేస్తున్నారని అసద్ మండిపడ్డారు.
తమిళ జల్లికట్టుకు, ఉమ్మడి పౌరస్మృతికి ముడిపెడుతూ అసద్ చేసిన వ్యాఖ్యల పట్ల బీజేపీ తీవ్రంగా స్పందించింది. అసద్ అసలు ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసద్ వ్యాఖ్యలు బోడిగుండుకు మోకాలికి ముడిపెట్టిన చందంగా ఉందన్నారు.
“Jallikattu protests, lesson for Hindutva forces. Uniform civil code can not be imposed. This nation cannot have one culture, we celebrate all”, this was the tweet by the Lok Sabha member Asadudin Owaisi on Friday reacting to the ongoing protest against the ban over Jallikattu in Tamil Nadu. The controversial comments raged debate from BJP leaders who questioned him about what is the point that is being made by him. Saying that there is no connection in what he is speaking with Jallikattu they have denied any link in forcing the muslims against their will  as told by Owaisi to bull fight.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *