చాగంటి దిష్టిబొమ్మ దగ్ధం

ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు వివరణతో యాదవ సంఘాలు తృప్తి చెందాయని ఇక వివాదం సమసిపోయిందని చాగంటి కోటేశ్వరరావు శిష్యులు ప్రచారం చేస్తుండగా మరో వైపు చాగంటి కోటేశ్వరరావుకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరుగుతూనే ఉన్నాయి. చాగంటి తరపున ప్రకటన విడుదల చేసినట్టుగా ఒక ప్రకటన సామాజిక మాధ్యామాల్లో చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం చాగంటి నివాసంలో యాదవ సంఘ ప్రతినిధులు చర్చలు జరిపారని వారికి చాగంటి ఇచ్చిన వివరణతో తృప్తిచేందారని, చాగంటి కోటేశ్వరరావు తన ప్రసంగంలో యాదవ కులాలకు క్షమాపణ చెప్పిన తరువాత సమస్య తీరిపోయిందంటూ ప్రకటన వెలువడిన కాసేపటికే యాదవ సంఘాల ఆధ్వర్యంలో చాగంటి కోటేశ్వరరావుకు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరగడం గమనార్హం. తాజాగా హైదరాబాద్ లో చాగంటి కోటే్శ్వరరావు దిష్టిబొమ్మను యాదవ సంఘ ప్రతినిదులు దగ్థం చేశారు. చాగంటి తన ప్రసంగాలతో యాదవ కులస్తులను అవమానించారని వారు ఆరోపించారు. చాగంటి కోటేశ్వరరావు పై వారు తీవ్ర స్థాయిలో విరుచుకునిపడ్డారు.
చాగంటి కోటేశ్వరరావు పై యాదవ సంఘాలు చేస్తున్న ఆందోళనను విరమించాలని పలువురు కోరుతున్నారు. ఆయన తాను ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదని చెప్పిన తరువాత కూడా సమస్యను మరింత జటిలం చేసే ప్రయత్నం చేయడం సమంజసం కాదని అంటున్నారు
 
The controversies and arguments get heated up on the speeches of the famous religious speaker Chaganti Koteswar Rao to pacify the Yadava community the his dummy was burnt in Hyderabad. Lately there have been various news of he quitting from speaking publicly on religious topics any further his supporters and followers were very much disappointed and extended their full support to him against those who were raising issues against him.
Prior to this Chagantihad clarified the issue that he never meant to insult the Yadava community and never meant to provoke any sort of controversy. For not letting go over this debate and continuing to drag him daily over non existing  issue, his supporters are really upset and worried for what if Mr.Chaganti really retires .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *