కొరియాలో కేటీఆర్ బిజీబిజీ

పెట్టుబడిదారులకు తెలంగాణ స్వర్గధామం వంటిదని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆహ్వానించే నిమిత్తం దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ఆయన అక్కడి కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడిదారులకు కల్పిస్తున్న సౌకర్యాలను గురించి వివరించారు. తమ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి అన్ని రకాల అనుమతులు సింగిల్ విండో పద్దతిలో పదిహేను రోజుల్లోనే లభిస్తాయని వివరించారు. తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే కొరియా సంస్థల కోసం ప్రత్యేకంగా పారిశ్రామిక పార్క్ ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అటోమోటీవ్,మిషనరీ,ఇంజనీరింగ్,ఎలక్ట్రానిక్స్,టెక్స్ టైల్స్, లైఫ్ సైనెస్స్ విభాగాల్లో పెట్టుబడులకు తెలంగాణ అనువైన ప్రాంతమని కేటీఆర్ వివరించారు. ప్రఖ్యాత సామ్ సంగ్ కంపెనీకి చెందిన అధికారులతో కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టే వారికి కల్పిస్తున్న సౌకర్యాలను గురించి వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మౌళిక వసతులను గురించి వారికి చెప్పిన కేటీఆర్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టల్సిందిగా ఆహ్వానించారు. కేటీఆర్ తో సమావేశం తరువాత పలు కొరియన్ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినట్టు సమాచారం. కొరియన్ కంపెనీ ప్రతినిధులతో సమావేశం అయిన కేటీఆర్ తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు.
 
In his tour to Korea to invite investors to Telangana IT and Industries minister KTR said that there is a very high scope of growth in Telangana state it being the fastest growing state in the country. In this context he was explaining that all the permissions required to the investors to invest in the state would be provided by single window system. All the formalities required will be done in fifteen days for the convenience of the investors. He said that especially for Korean investors the state would build an industrial park where in fields of automation, machinery, engineering, electronics, textiles, life sciences, would be encouraged. He was in a meeting with the officials of Samsung explaining them about the basic facilities available and invited them to invest in the state. After his visit to korea he expressed positive response is expected and there a is a scope of investments in the state.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *