పప్పీసార్ ది హత్యే…

అధ్యాపకుడిగా దిల్ షుఖ్ నగర్ ప్రాంతంలో సుపరిచితుడు వి.ప్రభాకర్ (పప్పి) హత్యకు గురైనట్టు పోలీసులు నిర్థారించారు. 2003 ప్రభాకర్ కనిపించకుండా పోయినట్టు ఆయన సోదరుడు వి. శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుండి మిస్సింగ్ కేసుగా నమోదయిన ఈ కేసునుహత్యగా పోలీసులు నిర్థారించారు. 2003 నుండి కనిపించకుండా పోయిన ప్రభాకర్ ను నయీం ముఠా కిడ్నాప్ చేసి హత్య చేసిందని పోలీసులు వెల్లడించారు. దిల్ షుఖ్ నగర్ ప్రాంతం నుండి తొలుత ప్రభాకర్ ను కిడ్నాప్ చేసిన ఈ ముఠా శ్రీశైలం అడవుల్లో హత్య చేసిందని పోలీసులు చెప్తున్నారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన నయీం ముఠా సభ్యుడు శ్రీహరిపై పోలీసులు పీీడీ యాక్టును ప్రయోగించారు. నయీం ఎన్ కౌంటర్ తరువాత పోలీసులు నయీం అనుచరులను అదుపులోకి తీసుకోవడంతో ఒక్కొటిగా వారి అరాచకాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభాకర్ ను కిడ్నాప్ చేసి హత్య చేసిన విషయం ఈ క్రమంలో వెలుగులోకి వచ్చింది.
దిల్ షుఖ్ నగర్ పి అండ్ టి కాలనీకి చెందిన ప్రభాకర్ (పప్పీ) స్థానికంగా పప్పీసార్ గా సుపరిచితుడు. దిల్ షుఖ్ నగర్ లోని కళాశాలతో పాటుగా స్థానిక ఇన్సిట్యూట్ లో ట్యూషన్లు చెప్పే ఈయన వద్దకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు వచ్చేవారు. మిస్సింగ్ కేసుగా ఉన్న ప్రభాకర్ ది హత్యగా తేలడంతో స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *