మరో వివాదంలో చాగంటి కోటేశ్వరరావు

ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు మరో వివాదంలో ఇరుక్కున్నారు. శ్రీకష్ణుడి జన్మవృత్తాంత గురించి చెప్తున్న సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై కొన్ని వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. చాగంటి కోటేశ్వరరావుకు వ్యతిరేకంగా కొంత మంది పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. చాగంటి చేసిన వ్యాఖ్యల వల్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ యాదవ కుల సంఘాలు మండిపడుతున్నాయి. చాంగటి కోటేశ్వరరావు తన ప్రసంగంలో శ్రీ కృష్ణుడు అమాయకులైన గొల్లల ఇంట వెలిశాడని అంటూ “తల కడిగితే మొల కడగని…. మొల కడిగితే తల కడగని” అమాయపు గొల్లల వద్ద కృష్ణ భగవానులు ఉన్నాడంటూ వ్యాఖ్యానించారు. దీనిపై యాదవ సంఘాలు మండిపడుతున్నాయి. తమ సామాజిక వర్గాన్ని తక్కువ చేసి మాట్లాడిన చాంగటి కోటేశ్వరరావు వెంటనే తమకు బేషరుతుగా క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని సమాజంలో తమను చిన్నచూపు చూసే విధంగా ఉన్నాయని వారు మండిపడుతున్నారు. చాగంటికి వ్యతిరేకంగా కొంత మంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలోనూ చాగంటి కోటేశ్వరరావుని వివాదాలు చుట్టుముట్టాయి. సాయిబాబాపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. అయితే దీనిపై ఆయన వివరణ ఇచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలలో ఎటువంటి పొరపాటు లేదని చెప్పారు. తన ఇంట్లో ఎప్పుడూ సాయిబాబా విగ్రహం ఉంటుందని తాను సాయిబాబాను దేవుడు కాదు అని ఎన్నడూ చెప్పలేదని వివరించారు. చాగంటి చేసిన వ్యాఖ్యల్లో ఎటువంటి తప్పులేదంటూ పలువురు ఆయనకు మద్దతు పలికారు. తాజా ఘటనపై చాగంటి కోటేశ్వరరావు స్పందించలేదు. అయితే చాగంటి చేసిన వ్యాఖ్యలలో ఎటువంటి తప్పులేదని అంటున్నారు. హింధూ ధర్మానికి సేవచేస్తున్న చాగంటి కోటేశ్వరరావును అనసరంగా పనిగట్టుకుని వివాదాల్లోకి లాగుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
Famous divonational  speaker Chaganti Koteswar rao is in news again for not so good reason. In his speech while he was speaking about lord Krishna few people expressed objection on his opinion and also lodged an official complaint quoting his this particular speech has hurt their sentiments and the belief.  He spoke about the story of Lord Krishna spending his childhood amongst yadavas who were very innocent to a very large extent. For this the yadava sanghs are unhappy and say that his speech is degrading their community in this society.they have demanded apology from him.
Even in past Mr. Chaganti was under obligation when he spoke of saibaba. At that time he had explained himself and said that he never quoted that saibaba was not a god instead he worships him and he has idol of the same in his house. With the new obligation where Mr.Chaganti has not yet commented his supporters say that when he is doing seva to the hindu society some people are wantedly blaming him on the name of caste when in fact there is no such intention in his speeches.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *