చిక్కుల్లో త్రిష

ప్రముఖ నటి త్రిష చిక్కుల్లో పడింది. తమిళనాడులో అత్యంత ఆదరణ ఉన్న జల్లికట్టు పోటీలను సుప్రీంకోర్టు నిషేధించింది. దీనికి ప్రధాన కారణం జంతుహక్కుల పరిరక్షణ సంస్థ (పెటా) కారణమని అభిప్రాయపడుతున్న వారు ఆ సంస్థకు ప్రచార కర్తగా ఉన్న త్రిష పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వేలాది సంవత్సరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని వ్యతిరేకిస్తున్న పెటాను ప్రచార కర్తగా ఉన్న త్రిష పై  ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఈ నటిపై తీవ్ర స్థాయిలో విమర్శలతో పాటుగా వ్యతిరేక ప్రచారం ఎక్కువైంది. తనపై వస్తున్న విమర్శలకు త్రిష కూడా అదే స్థాయిలో సమాధానం చెప్తుండడంతో వివాదం మరింత తీవ్ర రూపం దాల్చింది. తన సామాజిక మాధ్యమాలకు చెందిన ఖాతాలను కొందరు ఉద్దేశపూర్వకంగా హ్యాక్ చేశారని త్రిష పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వివాదం తీవ్ర రూపం దాలుస్తుండడంతో త్రిషకు మద్దతుగా సినీ ప్రముఖులు రంగంలోకి దిగారు. జల్లికట్టుకు తాము వ్యతిరేకంగా కాదని జల్లికట్టును పూర్తిగా సమర్థిస్తానని చెప్పిన కమల్ హాసన్ అదే సమయంలో పెటాకు ప్రచార కర్తగా ఉన్నంత మాత్రానా త్రిషపై విమర్శలు సరికాదని హితవు పలికారు. ఇది మంచి సంప్రదాయం కాదని అంటున్నారు. ఇటు త్రిష పై తమిళ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంతడడంతో త్రిష ఇంటి వద్ద పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *