అజహర్ కు ఎదురుదెబ్బ

 
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్  (హె చ్.సి.ఎ) అధ్యక్ష పదవికోసం భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజాహరుద్దీన్  వేసిన నామినేషన్ తిరస్కరణగు గురైంది. సాంకేతిక కారణాలతో అజహరుద్దీన్ నామినేషన్ ను తిరస్కరిస్తున్నట్టు  రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. అజహరుద్దీన్ నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో ప్రస్తుతం అధ్యక్షపదవికోసం వివేక్, జయసింహా రేసులో ఉన్నారు. ఎన్నికలు జనవరి 17న జరగనున్నాయి. ప్రతిష్టాత్మక హెచ్.సి.ఎ ఎన్నికల్లో పోటీచేయాలని భావించిన అజహర్ నామినేషన్ వేసినప్పటికి అది కూదరలేదు. అంతర్జాతీయ క్రికెట్ రంగంలో భారత్ కు ప్రాతినిధ్యం వహించిన హైదరాబాదీ ఆటగాడు అజహర్ పై 2000 సంవత్సరంలో బీసీసీఐ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై జీవిత కాల నిషేధం విదించింది. దీన్ని సవాలు చేస్తూ అజహర్ కోర్టును ఆశ్రయించగా ఏపీ హై కోర్టు బీసీసీఐ నిర్ణయాన్ని తప్పుబట్టడంతో పాటుగా అజహర్ కు క్లీన్ చిట్ ఇచ్చింది. తమ నామినేషన్ ను తిరస్కరించడం పట్ల అజహర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన నామినేషన్ ను ఎందుకు తిరస్కరించారో రిటర్నింగ్ అధికారి పూర్తి వివరణ ఇచ్చిన తరువాత దీనిపై తాను తదుపరి చర్యలకు ఉపక్రమిస్తానని చెప్పారు.
 
The nomination for the president post of Hyderabad Cricket association by the former cricketer  Azharuddin was rejected. The returning official said this happened due to some technological error. Now the names under consideration for presidential league for HCA are of Vivek and Jayasingh. Voting will be held on January 7th. In 2000 BCCI had given life time ban from the sport to Azharuddin on the charges of match fixing. But later AP High Court gave him a clean chit opposing BCCI decision. Azhar was obviously disappointed over the decision and asked the returning officer for an explanation for rejecting his nomination. He said accordingly his future course of action will be decided.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *