జోరుగా కోడి పందాలు

ఆంధ్రప్రదేశ్  లోని చాలా ప్రాంతాల్లో కోడి పందాలు జోరుగు సాగుతున్నాయి. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కోడి పందాలు నిరాఘాటంగా సాగుతున్నాయి. కత్తులు కట్టి కోడి పందాలపై నిషేధం విదిస్తూ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపధ్యంలో పోలీసులు కొన్ని ప్రాంతాల్లో కోడిపందాలను అడ్డుకున్నప్పటికీ అప్పటికప్పుడు వేదికలు మార్చుకుని పందాలను జోరుగా నిర్వహిస్తున్నారు. కోడి పందాలను అడ్డుకోవడంలో కోర్టు ఆదేశాలను పోలీసులు పూర్తిగా అమలు చేయలేకపోతున్నారు. స్థానికంగా పోలీసులపై తీవ్ర స్థాయిలో వత్తిడులు వస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా కోళ్ల పందాలకు బాహాటంగా మద్దతు పలుకుతున్నారు. ఇటువంటి సందర్భాల్లో కోడి పందాలను పూర్తి స్థాయిలో అడ్డుకోవడం సాధ్యం కాదని పోలీసులు సైతం అంగీకరిస్తున్నారు.
కత్తులు కట్టకుండా పందాలను నిర్వహించుకునేందుకు కోర్టు అనుమతి ఇవ్వడం పందెపు రాయుళ్లకు వరంగా మారింది. కత్తులు లేకుండా పందాలు నిర్వహిస్తున్నామని పోలీసులకు చెప్తున్నప్పటికీ  పోలీసులు అటు వెళ్లగానే కత్తులతో పందాలను నిర్వహిస్తున్నారు. కత్తులు లేకుండా పందాలు నిర్వహిస్తున్న ఆనవాళ్లు కనిపించడం లేదు.
On the eve of sankranthi cock fights are on full swing in Andhra Pradesh. Famous in East and West Godavari district this sport is in full swing even in this season. Knottinkk small knives to the feet of these cocks has been banned by the high court, in spite of that the sport lovers are changing the venues from time to time to save themselves from police raids.even under high pressure to implement the high court orders, police is unable to do so as even local leaders support cock fights which is the biggest hurdle says a police official.
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *