జవాను ఆక్రోశంపై స్పందించిన ప్రధాని కార్యాలయం

దేశసరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి మాతృభూమి రక్షణ కోసం పనిచేస్తున్న తమకు సరైన ఆహారం ఇవ్వడం లేదంటూ ఒక జవాను సామాజిక మాధ్యమాల్లో పెట్టిన వీడియో హల్ చల్ చేసింది. ఈ వీడియో వైరల్ గా మారడంతో దేశవ్యాప్తంగా దీనిపై చర్చ మొదలైంది. దేశ సరిహద్దుల్లో కుటుంబానికి దూరంగా నిరంతరం ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న తమకు అందిస్తున్న సౌకర్యాలపై సదరు జవాను గళమెత్తాడు. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా ప్రధాన మంత్రి కార్యాలయం హోం మంత్రిత్వ శాఖను వివరణ కోరింది. దేశ సరిహద్దుల్లో ఉన్న బీఎస్ఎఫ్ జవాన్లకు అందిస్తున్న సౌకర్యాలపై ప్రధాన మంత్రి కార్యాలయం హోం శాఖ వివరణ కోరింది. దీనికి సంబంధించిన నివేదికను వెంటనే అందచేయాల్సిందిగా ప్రధాన మంత్రి కార్యాలయం హోం మంత్రిత్వ శాఖను ఆదేశించింది. స్వయంగా ప్రధాని కార్యాలయం ఈ అంశంపై స్పందించడంతో హోం మంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది. బీఎస్ఎఫ్ జవాన్లకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నామని వారి ఆహరంలో అన్ని రకాల నాణ్యతా ప్రమాణాలను పాటిస్తున్నట్టు పేర్కొంది. ప్రధాని కార్యాలయానికి త్వరలోనే నివేదికను అందచేస్తామని హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది.
మరోవైపు బీఎస్ఎఫ్ జవాను వీడియోను స్పూర్తిగా తీసుకున్న సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడిని ఉద్దేశిస్తూ ఒక వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. తమకు అందచేస్తున్న జీతభత్యాలతో పాటుగా సౌకర్యాలపై సీఆర్పీఎఫ్ జవాను తన వీడియోలో ప్రధాని ఉద్దేశించి మాట్లాడుతూ పోస్ట్ చేశాడు. వరుసగా భద్రతా దళలా జవాన్లు చేస్తున్న పోస్టులు సంచలనం కలిగిస్తున్నాయి.
BSF JAWAN
As to the response of the video of BSF jawan which went viral in netizens PMO has asked the home ministry to submit a report on the food supplied to the jawans at the frontier. Inspired a paramilitary CRPF constable uploaded a video addressing PM Modi in youtube over pay pay and other facilities not being properly provided to them.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *