అత్మ"విశ్వాసమే" ఆయుధం

    స్వామి వివేకానంద యువజన శక్తికి ప్రతిరూపం… అత్మవిశ్వాసానికి మరో రూపం… 39 సంవత్సరాల చిరు ప్రాయంలోనే తన తనువును చాలించినా ప్రపంచమంతటా అప్పటికే తనదైన ముద్రను వేసిన వేదాంత వేత్త. గురువు రామకృష్ణ పరమహంస దగ్గర వేదాంతాన్ని ఔపోసన పట్టిన ఈయన అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా జనవరి 12 1863న కోల్ కత్తాలో జన్మించిన ఆయన చిన్నతనంలోనే తత్వశాస్త్ర లోతులను సృసించారు. ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక ప్రసంగాలు, రచనలు చేసిన వివేకానంద బేలూరు మఠనం, రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ లను స్థాపించారు. భక్తియోగ, జ్ఞానయోగ కర్మయోగ, రాజయోగ సిద్ధాంతాల్లో అనేక రచనలు చేసిన ఆయన వేదాంత తత్వాన్ని విశ్వవ్యాప్తం చేశారు. 1902 జులై 4న ప్రపంచాన్ని వదిలివెళ్లిన స్వామి వివేకానంద వివిధ సందర్భాల్లో చెప్పిన మాటలు కొన్ని

 

 • ప్రతి మనిషికీ వ్యక్తిత్వం ఊన్నట్లే, ప్రతి దేశానికీ, జాతికీ ఒక వ్యక్తిత్వం ఉంటుంది. దాన్ని పరిరక్షించుకోవాలి. అలా చేయనినాడు ఆ జాతి నశించిపోతుంది.
 • పదిమంది యువకుల్ని నాకివ్వండి. ఈ దేశ స్వరూపాన్నే మార్చేస్తాను.
 • ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో, దాని వల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది.
 • దైవభక్తి గురుభక్తిలపై అచంచల విశ్వాసం నీలో ఉన్నంత వరకూ నేకెవరూ అపకారం చేయలేరు.
 • ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే… ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్నే నాశనం చేస్తుంది.
 • మందలో ఉండకు ..వందలో ఉండటానికి ప్రయత్నించు.
 • కెరటం నాకు ఆదర్శం .. లేచి పడుతున్నందుకు కాదు పడినా కూడా లేస్తున్నందుకు.
 • ప్రయత్నం చేసి ఓడిపో కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోకు.
 • పిరికితనం మనిషిని నిర్వీర్యుడ్ని చేస్తుంది, ఆత్మవిశ్వాసం మనిషిని విజయపథం వైపు నడిపిస్తుంది.
 • మనం హీనులమని భావించుకుంటే నిజంగానే హీనులమైపోతాం.
 • విశ్వాసమే బలము, బలహీనతయే మరణము.
 • టన్ను శాస్త్రజ్ఞానం కన్నా ఔన్స్ అనుభవం గొప్పది.
  డబ్బులో శక్తి లేదు. కానీ మంచితనంలో, పవిత్రతలో శక్తి ఉంటుంది.
 • ఇతర దేశాలలో ప్రగల్భలాడేవారు చాలా మంది ఉన్నారు.కాని మతానుష్ఠాన పరులైనవారు, ఆధ్యాత్మికతను తమ జీవితాల్లో చాటి చూపిన వారిని ఇక్కడే, ఈ దేశంలో మాత్రమే చూడవచ్చు.
 • ఆత్మవిశ్వాసాన్ని గూర్చి నేర్చి దానిని ఆచరణలో చూపించి ఉంటే, మనం ప్రస్తుతం అనుభవిస్తున్న అనర్ధాలు,దుఃఖాలు దాదాపు మటుమాయమై పోయేవి.
 • మనిషికి వెలుగునిచ్చి మనోవికాసానికి తోడ్పడేది విద్య.

Swamy Vivekananada’s 154th birth anniversary was celebrated through out the nation. A visionary who changed the way youth think. Synonym of self confidence a man in his 39 years short life span left his remark on the world which would last for ages to come.Born on January 12, 1863, Narendranath Dattha became Swamy Vivekananda with his work on philosophy and trust in in Indian culture.Even during the pre independence time when India was struggling he changed the way of thinking of world population towards India.A strong believer and preacher of vedantha said that the youth of the nation is its future and inspired them to ‘Awake,arise stop not till the goal is reached’.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *