చంద్రబాబు తినే ఆహారం ఇదే

 
చంద్రబాబు నాయుడులోని కష్టించి పనేచేసే తత్వాం ఎప్పుడు ఉషారుగా ఉండే నైజాన్ని ఆయన రాజకీయ ప్రత్యర్థులు సైతం మెచ్చుకుంటూ ఉంటారు. చంద్రబాబు నాయుడు ఇంత ఆరోగ్యంగా చురుగ్గా ఉండడానికి కారణాలను ఆయన నెల్లురు జిల్లాలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో వివరించారు. తాను తినే ఆహరం ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది కాదని ఎక్కడైనా దొరుకుతుందని  చెప్పారు. తాను ఉదయం పూట రాగి,జొన్న,సజ్జ లాంటివి రోజుకో రకాన్ని నీళ్లలో  ఉడికించి తీసుకుంటానని చెప్పారు. ఆ తరువాత పచ్చసొన తీసేసిన ఉడబెట్టిన కోడి గుడ్లు తీసుకుంటానని చెప్పారు. భోజనానికి ముందు ఒక పండును తీసుకుంటానని భోజనంలో సజ్జ,జొన్న,రాగి ఏదో ఒకటి రెండు కూరగాయాలు కొద్దిగా పెరుగు తింటానని చంద్రబాబు పేర్కొన్నారు. ఇటీవలే చేపను తింటున్నానని చంద్రబాబు చెప్పారు.  సాయంత్రం కాఫీ తాగడాన్ని ఇటీవలే మొదలు పెట్టినట్టు చంద్రబాబు వివరించారు. రాత్రి సూప్ లేదా పండ్లతో సరిపెట్టుకుంటానని రాత్రి పడుకోబోయే ముందు మాత్రం పాలు తాగుతానని చెప్పారు. మితంగా ఆహారం తినడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చన్నారు. డబ్బులు ఉన్నంత మాత్రానా ఆరోగ్యంగా ఉంటారనుకుంటే పొరపాటేనని చంద్రబాబు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *