కోదండరాం ఇంటి ముట్టడి

తెలంగాణ జేఎసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఇంటిని ముట్టడించేందుకు విద్యార్థి జేఏసీ ప్రయత్నించింది. తెలంగాణాలో సాగునీటి ప్రాజెక్టులతో పాటుగా తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతున్నారంటూ కోదండరాం ఇంటిని జేఏసీ నేతలు ముట్టడించారు. తార్నాకా లోని కోదండరాం నివాసం వద్దకు చేరుకున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. పలువురు విద్యార్థి నేతలతో పాటుగా విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా కొద్ది సేపు ఉధ్రిక్తత వాతావరణం నెలకొంది. తెలంగాణలో పెద్ద ఎత్తున వస్తున్న సాగునీటి ప్రాజెక్టులను కోదండరాం ఉద్దేశపూర్తవకంగా అడ్డుకుంటున్నారని జేఏసీ నేతలు ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకోవడం ద్వారా తెలంగాణ అబివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కోదండరాం వ్యవహారశైలిని ఈ సందర్భంగా విద్యార్థులు తప్పుబడ్డారు. తెలంగాణ అబివృద్ధిలో భాగస్వామి కావడానికి బదులు తెలంగాణ లో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అడ్డుకట్టలు వేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. కోదండరాం ఒక ప్రత్యేక అజెండాతో ముందుకు వెళ్తున్నారని ఇది ఎంత మాత్రం సరైన చర్యకాదని వారు పేర్కొన్నారు. వెంటనే కోదండరాం తన వ్యవహార శైలిని మార్చుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *