బ్యాంకుల్లో డబ్బులేస్తే లెక్క చెప్పాల్సిందే

పెద్ద నోట్ల రద్ద తర్వరా దేశవ్యాప్తంగా పెద్ద మొత్తంలో నగదు బ్యాంకుల్లో జమ అయింది. ఇన్నాళ్లు చాలా మంది ఇనప్పెట్టెల్లో మూలుగుతూ ఉన్న డబ్బు ఇప్పుడు బ్యాంకుల్లోకి చేరుకుంది. చాలా మంది తమ అకౌంట్లతో పాటుగా ఇతరుల అకౌంట్లలో కూడా పెద్ద మొత్తంలో నగదును డిపాజిట్ చేశారు. చాలా బినామీ ఖాతాల్లో నగదు జమ జరిగింది. పన్నులు ఎగవేసి ఇప్పుడు బ్యాంకుల్లోకి డబ్బు మళ్లించినంత మాత్రనా అది నల్లధనం కాకుండా పోదని ఆర్థిక శాఖ అంటోంది. బ్యాంకుల్లోకి చేరిన డబ్బు ఎవరిది వారికి ఎక్కడి నుండి వచ్చింది అనేదానిపై ఆర్థిక శాఖ క్షుణ్ణంగా విచారించనుంది. ఇప్పటిదాకా ఎంత మొత్తంలో జగదు జమ అయింది వాటి వివరాలు తెప్పించుకుంటున్న ఆర్థిక శాఖ అనుమానాస్పద అకౌంట్లకు సంబంధించిన వివరాలను ఆదాయపుపన్న శాఖకు పంపుతున్నారు.  బ్యాంకుల్లో డబ్బులు జమ చేసేశాం అనుకుంటున్న వారు తమ అకౌంట్లలోని డబ్బులకు ఖచ్చితంగా లెక్కలు చెప్పాల్సి ఉంటుంది.
తమ వద్ద నున్న నల్లధనాన్ని మార్చుకునే క్రమంలో చాలామంది పెద్ద నోట్లను అనేక అకౌంట్లలో జమచేశారు. డబ్బులు బ్యాంకుల్లో జమ అయిపోయాయి కనుక నిశ్చింతగా ఉండవచ్చనే వారికి కేంద్రం ముచ్చెమటలు పట్టిస్తోంది. ప్రతీ అకౌంట్ కు సంబంధించిన లెక్కలను క్షుణ్ణంగా పరిశీలించే పనిలో పడిన కేంద్ర ఆర్థిక శాఖ అనుమానాస్పద ఖాతల భరతం పట్టెపనిలో ఉంది. ఇప్పటికే ఆర్థిక శాఖ చాలా ఖాతల లావాదేవీలు అనుమానాస్పదంగా ఉన్నట్టు గుర్తించింది. 125కోట్ల జనాభాలో కేవలం 24 లక్షల మంది మాత్రమా తమకు సంవత్సరానికి 10 లక్షలు లేదా అంతకన్నా ఎక్కువ ఆదాయం వస్తోందని చెప్పారు. మరో 52 లక్షల మంది 5 నుండి 10 లక్షల మధ్య ఆదాయం వస్తున్నట్టుగా పేర్కొన్నారు. ఆ మేరకు పన్నులు కట్టారు. చాలా మంది తమ వాస్తవ ఆదాయం కన్నా చాలా తక్కువ చూపించి పన్నును ఎగవేశారు. ఇప్పుడు అటువంటి వారికి కష్టాలు తప్పెలా లేవు. పన్ను ఎగవేతదారుల భరతం పట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.
బ్యాంకుల్లో డబ్బులున్న ప్రతీవారి తమ లెక్కలకు తప్పనిసరిగా లెక్కలు చెప్పాల్సిందే. లేకపోతో భారీ మొత్తంలో జరిమానా విధించే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *