సి.వి.ఆనంద్ కు అరుదైన గౌరవం

ఎన్నికల నిర్వహణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగించాలని  తెలంగాణ పౌర సరఫరాల శాఖ కమిషనర్ సి.వి.ఆనంద్ అన్నారు.  త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి భారత ఎన్నికల సంఘం నిర్వహించిన కీలక సమావేశంలో ఆనంద్ ప్రసంగించారు. “ఎన్నికల వ్యయ నియంత్రణ, నిఘా సమాచార సేకరణ, ఎన్నికల విధుల నిర్వహణకు సంబంధించి వ్యక్తులు, సంస్థల మధ్య సమన్వయం” అనే అంశం పై జరిగిన సమావేశంలో ఆనంద్ కీలకోపన్యాసం చేశారు.
civil1
ప్రధాన ఎన్నికల అధికారి సహా ఎన్నికల అధికారులు హాజరైన ఈ సమావేశంలో కీలక ప్రసంగం చేసే అరుదైన గౌరవం సి.వి.ఆనంద్ కు దక్కింది.  సమాచారాన్ని ఇచ్చిపుచ్చునే క్రమంలో వాట్సప్ లాంటి యాప్ లను ఉపయోగించుకోవడం వల్ల సమాచారం త్వరగా చేరుతుందన్నారు. గతంలో ఎన్నికల విధుల నిర్వహణలో పి.వి.ఆనంద్ అనుసరించిన విధానాలను కేంద్ర ఎన్నికల సంఘం ఆ తరువాతి ఎన్నికల్లో కూడా అనుసరించింది. 2014 సాధారణ ఎన్నికల్లో సి.వి.ఆనంద్ తనబరిచిన ప్రతిభకు జాతీయ అవార్డు సైతం అందుకున్నారు. తమిళనాడు ఎన్నికల పరిశీలకుడిగా, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా సాధరణ ఎన్నికల సమయంలో వ్యవహరించిన సి.వి. ఆనంద్ ఎన్నికల వ్యయ నియంత్రణ, మధ్యం సరఫరాను కట్టడిచేయడంలో ప్రశంసనీయమైన పాత్రను నిర్వహించారు. ప్రస్తుతం దేశరాజధానిలో సి.వి.అనంద్ వివిధ సందర్భాల్లో వ్యవహరించిన తీరును ఎదుర్కొన్న సమస్యలను ఉదాహరణలతో సహా వివరించారు. ఆయన ప్రసంగం ఈ కార్యక్రమానికి హాజరైన నోడల్ అధికారులను విశేషంగా ఆకట్టుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *