ఆదివారం అర్థరాత్రి నుండి పెట్రలో బంకుల్లో కార్డులను అనుమతించరు. కార్డుల ద్వారా పెట్రోలు పోయించుకోవడం కుదరుదు. ఒక వైపు నగదు దొరక్క ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా పెట్రోలు పోయబోమంటూ బంకు యాజమాన్యాలు పెద్ద బాంబును పేల్చాయి. కార్డుల చెల్లింపులపై వసూలు చేయాల్సిన అదనపు ఛార్జీలను డీలర్ల నుంచి వసూలు చేయాలని నిర్ణయించడాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇండియన్ పెట్రోలియం డీలర్స్ సంఘం పేర్కొంది. డీజిల్‌పై 2.5శాతం, పెట్రోల్‌పై 3.2శాతం చొప్పున డీలర్లకు కమిషన్ వస్తుందని.. అందులో నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించడం దారుణమని సంఘ ప్రతినిధులు పేర్కొన్నారు. తమ లావాదేవీల్లో 80శాతం కార్డుల ద్వారానే జరుగుతున్నాయని, ఇలాంటప్పుడు అదనపు ఛార్జీలు డీలర్లు వద్ద వసూలు చేస్తామంటే ఎట్లా అని డీలర్లు ప్రశ్నిస్తున్నారు. పెట్రోలు బంకు యజమాన్యాల నిర్ణయంతో ప్రజలు నానా ఇబ్బందులు పడే అవకాశాలున్నాయి.