యువీకి జట్టులో చోటు

0
46
India's Yuvraj Singh celebrates his century during the Cricket World Cup match between India and West Indies in Chennai, India, Sunday, March 20, 2011. (AP Photo/Kirsty Wigglesworth)

ఇంగ్లాండ్ తో జరిగే మూడు వన్డేలు, మూడు టి-20 మ్యాచ్ ల సిరీస్ కు భారత జట్టును ఎంపిక చేశారు. ధోని వన్డేలతోపాటుగా టి-20 కెప్టెన్సీ నుండి తప్పుకుంటున్నట్టు ప్రకటించడంతో విరాట్ కోహ్లీని కెప్టెన్ గా ఎంపిక చేశారు.  జట్టులో పెద్దగా మార్పులు లేనప్పటికీ మూడు సంవత్సరాల తరువాత యూవరాజ్ సింగ్ జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. ఇటీవల కాలంలో దేశవాళీ క్రికెట్ టోర్నీలలో మంచి ప్రదర్శన ఇస్తున్న యువరాజ్ భారత జట్టుకు ఎంపికయ్యాడు. సురేష్ రైనాకు జట్టులో చోటు లభించలేదు. ఇటీవల వివాహం చేసుకున్న యూవీకి ఇది తీపికబురే.
వన్డే జట్టు: విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), ఎంఎస్‌ ధోని (వికెట్‌ కీపర్‌), కేఎల్‌ రాహుల్‌, శిఖర్‌ ధావన్‌, మనీశ్‌ పాండే, కేదార్‌ జాదవ్‌, యువరాజ్‌ సింగ్‌, అజింక్య రహానె, హార్దిక్‌ పాండ్య, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అమిత్‌ మిశ్రా, జస్ప్రీత్‌ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌, ఉమేశ్‌ యాదవ్‌.
టీ20 జట్టు: విరాట్‌ కోహ్లి (కె), ఎంఎస్‌ ధోని (వి), మన్‌దీప్‌, కేఎల్‌ రాహుల్‌, యువరాజ్‌ సింగ్‌, సురేశ్‌ రైనా, రిషబ్‌పంత్‌, హార్దిక్‌ పాండ్య, అశ్విన్‌, జడేజా, యజువేంద్ర చాహల్‌, మనీశ్‌, బుమ్రా, భువనేశ్వర్‌, ఆశిష్‌ నెహ్రా
 
 

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here