కశ్మీర్ పై మరోసారి పాక్ వివాదాస్పద వ్యాఖ్యలు

0
68

పాకిస్థాన్ కాశ్మీర్ పై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. కాశ్మీర్ పాకిస్థాన్ లో అంతర్భగమంటూ మరోసారి తేనెతుట్టెను కదిలించారు ఆ దేశపు ప్రధాని నవాజ్ షరీఫ్. భారత్ హెచ్చరికలను పెడచెవిన పెడుతూ కాశ్మీర్ పై నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలద్వారా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసే పాకిస్థాన్ తన బుద్దిని మరోసారి ప్రదర్శించింది. ఆశ్మీర్ అంశంపై రెండు రోజుల అంతర్జాతీయ పార్లమెంటరీ సదస్సులో మాట్లాడిన పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీష్ తన బుద్దిని మరోసారి బయటపెరట్టారు. భారత్ పై అక్కసు వెళ్లగక్కుతూ కాశ్మీర్ లో ప్రజలు స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. పనిలో పనిగా  హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాది బుర్హాన్‌ వనీని పొగిడారు. వనీ శక్తిమంతమైన, ప్రజాకర్షణ గల నాయకుడని అన్నారు. అమరుడైన వనీ కశ్మీరీ ఉద్యమానికి సరికొత్త మలుపు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. భద్రతా బలగాలు వనీని కాల్చి చంపడాన్ని నిరసిస్తూ కశ్మీరీలు చేస్తున్న ఆందోళనలను భారత బలగాలు అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నందుకు చింతిస్తున్నానన్నారు.
కాశ్మీర్ లో ప్రజల పక్షాన తమ దేశం నిలబడుతుందని అక్కడి ప్రజలు విముక్తిని కోరుకుంటున్నారంటూ వ్యాఖ్యానించారు. గతంలోనూ షరీఫ్ ఉగ్రవాదులకు వత్తాసు పలుకుతూ మాట్లాడారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here