ధోనీ ఎందుకు దిగిపోయాడు?

భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా పేరుపొందిన మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీ నుండి ఎందుకు తప్పుకున్నాడు ఇప్పుడు క్రికెట్ అభిమానులను అందరి మదినీ తొలుస్తున్న ప్రశ్న ఇదే. అద్భుతమైన ఫినిషర్ గా అంతకు మించి సమర్థ నాయకుడిగా పేరుగాంచిన ధోనీ అఖస్మాత్తుగా వన్డే, టీ-20ల కెప్టెన్సీలకు దూరం అవుతున్నట్టు బీసీసీఐకి సమాచారం ఇచ్చి అందరినీ షాక్ కు గురిచేశాడు. ఇప్పటికే టెస్టు మ్యాచ్ లకు దూరంగా ఉంటూ వచ్చిన ధోనీ తాజాగా కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు.
అసలు ధోనీ ఈ నిర్ణయానికి రావడం వెనుక కారణాలను పరిశీలిస్తే ఇటీవల కాలంలో ధోనీ ఆడిన అంతర్జాకీయ మ్యాచ్ లు చాలా తక్కువ. భారత్ ఎక్కువగా టెస్టు మ్యాచ్ లను ఆడుతోంది దీనితో ఈ తరహా మ్యాచ్ లకు దూరం అయిన ధోనీ అంతర్జాతీయ మ్యాచ్ లకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. మరో వైపు ఇటీవల కాలంలో అతని ఫాం కూడా అంత గొప్పగా ఏం ఉండడం లేదు. గతంలో మాదిరి ధోని అద్భుతమైన ఇన్నింగ్స్ ను ఆడలేకపోతున్నాడు. ధోనీ కీపింగ్ పైనా, ఫిట్ నెస్ పైనా ఎటువంటి సందేహాలు లేకపోయినా మహీ తనదైన తరహాలో బ్యాంటిగ్ చేయడం లేదన్నది మాత్రం నిజం. అంతర్జాతీయ మ్చాచ్ లకు చాలా కాలం పాటు దూరంగా ఉండడంతో పాటుగా ఫాంను కోల్పోతుండడం కూడా ధోనీ కెప్టెన్ గా దూరం కావడానికి కారణంగా చెప్తున్నారు. టెస్టుల్లో కెప్టెన్ గా వ్యవహరిస్తున్న విరాట్ కోహ్లీ అటు ఆటగాడిగా ఇటు కెప్టెన్ గా అద్భుతమైన ప్రదర్శన ఇస్తుండడం కూడా ధోనీ నిర్ణయానికి కారణం అయిఉంటుందని భావిస్తున్నారు.
భారతీయ క్రికెట్ కంట్రోల్ బోర్డులో తాజాగు చోటుచేసుకుంటున్న పరిణామాలు కూడా ధోనీకి నచ్చడం లేదని కెప్టెన్ గా ధోనీ తప్పుకోవడం వెనుక ఇది కూడా ఒక కారణం అయి ఉండవచ్చని భావిస్తున్నరు. ఏది ఏమైనా భారత్ కు కపిల్ దేవ్ తరువాత వన్డే ప్రపంచకప్ ను అందించడంతో పాటుగా టి-20, చాంపియన్స్ ట్రోఫీలను కెప్టెన్ గా సాధించినపెట్టిన మహీ భారత అత్యన్నత కెప్టెన్ అనండంలో ఎటువంటి సందేహం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *