గన్ మెన్ అకౌంట్లో వందకోట్లు

     ఒక ఎమ్మెల్యే గన్ మెన్ ఖాతాలో వంద కోట్ల రూపాయలు చేరాయి. అయితే అంత పెద్ద మొత్తంలో తన ఎకౌంట్ లో డబ్బులు ఎట్లా వచ్చాయే సదరు గన్ మెన్ కు మాత్రం తెలీదు. ఏకంగా తన ఖాతాలో వంద కోట్ల రూపాయలు ఉన్నట్టు మెసేజ్ రావడంతో సదరు వ్యక్తి ఖంగుతిన్నాడు. ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్లో గులాం జిలానీ అనే పోలీస్ కానిస్టేబుల్ ఎమ్మెల్యే ఇర్ఫాన్ సోలంకీ వద్ద గన్ మెన్ గా పనిచేస్తున్నాడు. బ్యాంకు ఏటీఎం నుండి కొద్ది మొత్తంలో డబ్బును తీసుకున్న తరువాత తన ఫోన్ కు వచ్చిన మెసేజ్ చూసి కానిస్టేబుల్ ఖంగుతిన్నాడు. తన ఖాతాలో ఏకంగా వంద కోట్ల బ్యాలెన్స్ ఉన్నట్టు మెసేజ్ రావడంతో కానిస్టేబుల్ తనకు వచ్చిన మెసేజ్ ను నమ్మలేదు. తిరిగి ఒక సారి సరిచూసుకోగా తన ఖాతాలో నిజంగానే వంద కోట్ల రూపాయలు ఉన్నట్లు తేలింది. దీనితో ఈ విషయాన్ని కానిస్టేబుల్ ఎమ్మెల్యే దృష్టికి తీసకుని రాగా ఆయన జిల్లా కలెక్టర్ కు సమాచారం ఇచ్చారు. కానిస్టేబుల్ అకౌంట్లో ఇంత పెద్ద మొత్తం ఎట్లా వచ్చింది అనేదానిపై బ్యాంకు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటువంటి ఘటనలు ఇటీవల తరచూ జరుగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *