పీజ్ రియంబర్స్ మెంట్ కొనసాగుతుంది:సీఎం

విద్యార్థులకు ఇస్తున్న ఫీజ్ రియంబర్స్ మెంట్ లో ఎటువంటి జాప్యం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. సరైన సమయానికే విద్యార్థులకు ఫీజును రియంబర్స్ చేస్తున్నామని ఆయన అసెంబ్లీలో చెప్పారు. ఫీజ్ రీయంబర్స్ మెంట్ పై అసెంబ్లీలో జరిగిన చర్చలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ విద్యార్థులకు బోదనా రుసులు చెల్లింపులో ఎటువంటి జాప్యం జరగడం లేదన్నారు. ప్రస్తుతం ఫీజ్ రియంబర్స్ మెంట్ కోసం ఏటా 2500 కోట్ల రూపాయలు అవసరం అవుతున్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. కొత్త ప్రభుత్వం ఏర్పడేనాటికి 1880 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని సీఎం చెప్పారు. ఈ పథకాన్ని కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారంతో విద్యార్థులను అయోమయానికి గురిచేయవద్దని సీఎం అన్నారు. గత ప్రభుత్వమే కళాశాలలు చెల్లించాల్సిన మొత్తాన్ని బకాయి పెడుతూ వచ్చిందని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పథకాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. బోధనా రుసుము విషయంలో అవకతవకలకు పాల్పడే వారిని ఉపేక్షించబోమని చెప్పారు. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. విద్యార్థుల పేరుతో దోపిడీకి పాల్పడితే సహించేది లేదన్నారు. అంతకు ముందు మాట్లాడిన కాంగ్రెస్ సభ్యులు ఫీజ్ రియంబర్స్ మెంట్ పథకాన్ని ప్రభుత్వం సక్రమంగా అమలు చేయడంలేదని ఆరోపించారు. బకాయిలు పేరుకుపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కళశాలల యజమాన్యాలు విద్యార్థుల నిండి బలవంతంగా ఫీజులను వసూలు చేస్తున్నారని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *