త్వరలో మరిన్ని సర్జికల్ దాడులు?

నియంత్రణ రేఖను ఆనుకుని ఉన్న ఉగ్రవాద స్థావరాలపై మరోసారి భారత్ సర్జికల్ దాడులు నిర్వహించే అవకాశాలున్నట్టు స్వయంగా ఆర్మీ చీఫ్ వెల్లడించారు. భారత ఆర్మీ చీఫ్ బిపిన్  రావత్ ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వూలో సంచలన విషయాలను వెల్లడించారు. టెర్రరిస్టు స్థావరాలపై దాడిచేసే హక్కు భారత్ కు ఉందని ఆయన స్పష్టం చేశారు. టెర్రరిస్టు స్థావరాలపై మెరుపుదాడులు చేసేందుకు భారత బలగాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. నియంత్రణ రేఖను దాటి దాడులు జరపడాన్ని బిపిన్ రావత్ సమర్థించుకున్నారు. నియంత్రణ రేఖకు అనుకుని ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయని చెప్పారు. వాటిని ద్వంసం చేయడం మన హక్కు అని తేల్చిచెప్పారు.
army-chief
సెప్టెంబర్ 29న పాకిస్థాన్ భూబాగంలోకి చొచ్చుకునిపోయి మన బలగాలు నిర్వహించిన సర్జికల్ దాడుల్లో కీలక పాత్ర పోషించిన రావత్ ఆరోజు జరిగిన దాడులకు సంబంధించిన విశేషాలను వెల్లడించారు. నియంత్రణ రేఖను దాటి రెండు కిలోమీటర్ల దూరం మన సైనికులు వెళ్లారని రావత్ చెప్పారు. అక్కడ భారత్ లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్న ఏడు ఉగ్రవాద స్థావరాలపై భారత సైనికులు మెరుపుదాడి చేశారని చెప్పారు. చీకటి పడిన తరువాత మొదలైన ఆపరేషన్ ఉదాయానికల్లా పూర్తయిందని ఆయన పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ మొత్తం డ్రోన్ కెమేరాల సహాయంతో రికార్డు చేసినట్టు రావత్ వెల్లడింతారు. మన జవాన్ల భద్రతకు అత్యధిక ప్రధాన్యత ఇస్తూనే శత్రువులు తప్పించుకునే అవకాశం లేకుండా భీకర దాడులు చేసినట్టు ఆర్మీ చీఫ్ చెప్పారు. సర్జికల్ దాడుల కోసం భారత సైన్యం పక్కా ప్రణాళికను రూపొందించిందని ఆయన పేర్కొన్నారు. ఇందులోకి చాలా వివరాలు భద్రతా కారణాల వల్ల వెల్లడించలేమని రావత్ స్పష్టం చేశారు.
భారత ఆర్మీ చీఫ్ నియామకంలో సీనియారిటీని పక్కన పెట్టిన అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నడుచుకోవడం ఆర్మీ అధికారుల బాధ్యత అని చెప్పారు. తన నియామకం వల్ల సీనియర్ అధికారుల్లో అసంతృప్తులు లేవన్నారు. తనకన్నా సీనియర్లు అయిన అయిన ఇద్దరు అధికారులతో తనకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తామంతా ఒకే కంచం, ఒకే మంచం లాగా వ్యవహరించేవారమని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేసేందుకు తాను ఎటువంటి ప్రయత్నాలు చేయలేదన్నారు.
 
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *