దుమ్మురేపుతున్న బీమ్ యాప్

నగదు రహిత చెల్లింపుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన “భీమ్ ” యాప్ సంచలనం సృష్టిస్తోంది. డిసెంబర్ 30 వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన ఈ యాప్ పోటీ యాప్ లకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఇందులోని ఫీచర్స్ వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఈ యాప్ ను డిసెంబర్ 30వ తీదీ నుండి నేటి వరకు దాదాపు 35 లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. ఈ యాప్ ద్వారా దాదాపు 5 లక్షలకు పైగా లావాదేవీలు జరిగాయి. ఈ యాప్ సురక్షితమైనది కావడంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం ఈ యాప్ ను తయారు చేయడంతో ఎక్కువ సంఖ్యలో ఈ యాప్ ను వాడడానికి వినియోగదారులు ఆశక్తి చూపుతున్నారు. డిజిటల్ చెల్లింపుల్లో భీమ్ యాప్ అగ్రస్థానానికి చేరుకుంటోంది. ఈ యాప్ ను ఉపయోగించే వారు పెరుగుతుండడంతో ఈ యాప్ ను మరికొన్ని భాషల్లో కూడా అందుబాటులోకి తీసుకుని వచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ప్రస్తుతం ఇంగ్లీష్ తో పాటుగా హిందీలోనూ ఈ యాప్ అందుబాటులో ఉంది. త్వరలో మరిన్ని ప్రాంతీయ భాషల్లో ఈ యాప్ ను అందుబాటులోకి తీసుకుని రానున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి . ప్రస్తుతం భీమ్ యా కు విశేషంగా లభిస్తున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని మరిన్ని ఫీచర్లను అందుబాటులోకి తీసుకుని రావడానికి ప్రయత్నిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *