జయమరణంపై అముమానాల్లేవంటున్న వెంకయ్య

0
64

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణంపై తమకు ఎటువంటి సందేహాలు లేవని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఈ విషయంపై ఎలాంటి అనుమానాలకు తావు లేదన్నారు. జయ మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించినందు వల్ల కోర్టు నిర్ణయం ప్రకారం కేంద్ర ప్రభుత్వం నడుచుకుంటామని చెప్పారు. కేంద్రానికి కోర్టు నోటీసులు ఇస్తే దాని సమాధానం ఇస్తామని చెప్పారు. జయలలిత మృతదేహాన్ని వెలికితీసి పరీక్షలు ఎందుకు నిర్వహించకూడదంటూ మద్రాస్ హైకోర్టు న్యామూర్తి చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమన చెప్పారు. జయలలిత మృతదేహానికి పరీక్షలు నిర్వహించాలనే వాదనను తాను వ్యక్తిగతంగా పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టు వెంకయ్య నాయుడు చెప్పారు. జయలలితకు పూర్తి వైద్య  సేవలు అందాయని వైద్య పరంగా ఎటువంటి లోపం జరగలేదన్నారు. జయలలితకు జరిగిన వైద్య సేవలకు సంబంధించి ఎప్పటికప్పుడు వైద్య బృందం బులెటిన్ లు విడుదల చేసిందని వైద్యులను నమ్మకపోవడానికి ఎటువంటి కారణాలు తనకు కనిపించడం లేదన్నారు. జయలలిత మరణానికి సంబంధించి ఎవరివద్దనైనా ఆధారాలు ఉంటే అధికారులకు వాటిని సమర్పించవచ్చని అన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీరు సెల్వం నియామకంపై తమ ప్రమోయం ఏమీ లేదని చెప్పారు. అన్నా డీఎంకే అంతర్గత రాజకీయాల్లో తాము జోఖ్యం చేసుకోబోమని చెప్పారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here