కుల రహిత రాజకీయాలు సాధ్యమేనా?

దేశంలో కుల, మత రాజకీయాలు మరోసారి తెరపైకి వచ్చాయి. మతం,కులం,జాతి,వర్గం,భాష ప్రాతిపదికగా ఓట్లేయాలంటూ అడిగే ఏ విజ్ఞప్తి అయినా ఎన్నికల నిబంధనావళి ప్రకారం అవినీతి కిందకే వస్తుందని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. కుల, మత రాజకీయాలు చేసే వారికి ఇది గట్టి ఎదురుదెబ్బే, సుప్రీం కోర్టు తీర్పు ఖచ్చితంగా అందరికీ శిరోధార్యమే. సుప్రీం కోర్టు తీర్పు నేపధ్యంలో దేశంలో కుల, మత రాజకీయాలు తగ్గిపోతాయని ఆశించడం అత్యాశే అవుతంది. సుప్రీం తీర్పు నేపధ్యంలో నాయకులు నేరుగా కాకుండా పరోక్షంగా కుల, మత రాజకీయలను ప్రభావితం చేస్తారు. కులానికి రాజకీయానికి మనందేశంలో విడదీయరాని బంధం ఉంది. ఏ కులానికి చెందిన ఓటర్లు ఎక్కువ మంది ఉంటే లేదా ఏ కులానికి చెందిన ప్రాబల్యం ఎక్కువ ఉంటే వారికే టికెట్లు ఇచ్చే సంస్కృతి మామూలే. కుల రాజకీయాలను పక్కన పెట్టాలని కోరుకునే వారు నీతులు చెప్పే నేతలు ఎంత మంది ఉన్నా తీరా ఎన్నికల సీట్ల కేటాయింపులో కులానిదే ఆగ్రతాంబూలం.
వ్యక్తికి, దేవుడికి మధ్య సంబంధం వ్యక్తిగతం అని సుప్రీం కోర్టు తన తీర్పు సందర్భంగా చెప్పిన మంచి మాటలు తలకెక్కించుకునే వారు ఎంత మంది. ఎన్నికైన ప్రజా ప్రతినిధుల పనితీరు లైకికంగా ఉండాలంటూ తీర్పు చెప్పిన సుప్రీం కోర్టు మత, కుల ఆధారంగా ఓట్లను అడగడాన్ని తప్పుపట్టింది. రాజకీయం కులం,మతం పెనవేసుకుని పోయిన ప్రస్తుత పరిస్థితుల్లో సుప్రీం కోర్టు తీర్పుతో పరిస్థితిలో మార్పు వస్తుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. పేరు గొప్ప పార్టీలు అన్నీ కుల రాజకీయాలకు పాల్పడుతున్నవే. సమసమాజం అంటూ చెప్పే కమ్యూనిస్టులను కూడా కుల జాడ్యం వదిలిపెట్టలేదు. కుల ప్రాబల్యం పార్టీల్లోనూ ఎన్నికల్లోనూ కలగలిసిపోయింది. మత ప్రాతిపదికను ఓట్లను దుండుకునే పార్టీలను మనం చూస్తూనే ఉన్నాం. కేవలం మత ప్రాతిపదికను అధికారంలోకి వచ్చే పార్టీలు ఉన్నాయి.
సుప్రీం కోర్టు ఆదేశాల తరువాత కనీసం కొంతమేరకు అయినా కుల,మత రాజకీయాలు ఈ దేశంలో సమసిపోతే అంతకాన్నా కావాల్సిందేముంది. సుప్రీం కోర్టు ఆదేశాలు పూర్తిగా అమలు జరగాలని కోరుకుందాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *