పార్టీని ముంచిన తోడికోడళ్ల వైరం

సమాజ్ వాదీ పార్టీలో ములసం పుట్టడానికి ప్రధాన కారణం తోడికోడళ్ల మధ్య వైరమే అని ములాయం కుటుంబ పరిస్థితులు తెలిసిన వారు చెప్తున్నారు. బాబాయ్, అబ్బాయ్ ల మధ్య చిచ్చుకు కూడా ఇదే కారణంగా భావిస్తున్నారు. సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కు ఇద్దరు కుమారులు ఒకరు ప్రస్తుత ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కాగా రెండ కుమారుడు ప్రతీక్ యాదవ్. తండ్రి ఒకరే అయినప్పటికీ విరిద్దరి తల్లులు వేరు. మొదటి భార్య మాలతీ దేవి కాగా రెండు భార్య సాధనా గుప్తా. సాధనా గుప్తా తో ములాయంకు ఉన్న సంబంధాలకు అంతర్గతంగా వార్తలు వచ్చినప్పటికీ 2007 వరకు ఆమెను తన భార్యగా ములాయం బహిరంగంగా ఎన్నడూ ప్రకటించలేదు. 2003లో మాలతీ చనిపోయినప్పటికీ సాధన తెరవెనుకే ఉండిపోయారు. ములాయం సాధనలకు 1988లో ప్రతీక్ జన్మించారు. ములాయం కుటుంబంలో ఈ వ్యవహారం చిచ్చు రేపుతూనే ఉంది.
mulayam3 mulayam2
అఖిలేష్ యాదవ్ కు సవతి సోదరుడికి మధ్య మొదటి నుండి సత్సంబంధాలు లేవు. తల్లి మరణం తరువాత సాధానాను తన బార్యగా ములాయం ప్రకటించిన తరువాత కొద్దిగా పరిస్థితిలో మార్పు వచ్చింది. అఖిలేష్ సవతి సోదరుడు ప్రతీక్ వివాహం తరువాత ప్రతీక్ భార్య రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనడంతో తిరిగి వివాదం రాజుకుంది. అఖిలేష్ భార్య ఇప్పటికే లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అమె కనౌజ్ నుండి సమాజ్ వాదీ పార్టీ తరపున గొలుపొందారు. ఆ తరువాత కోడళ్ల మధ్య రాజకీయ విభేదాలు ముదిరి పాకాన పడ్డాయి. మొదటి నుండి సాధనా కుటుంబానికి మద్దతు పలుకుతున్న సమజ్ వాదీ సీనియర్ నేత అమర్ సింగ్ అంటే అఖిలేష్ కు సరిపడదు. కొడుకు ఒత్తిడితోనే అమర్ సింగ్ ను ములాయం పార్టీ నుండి బయటకు పంపారని అంటారు.
mulayam6 mulayam5
మారిన పరిస్థితుల నేపధ్యంలో అమర్ సింగ్ తిరిగి పార్టీలో చేరడంతో అఖిలేష్ వ్యతిరేక వర్గానికి బలం చేకూరింది. దీనికి తోడు ములాయం సింగ్ యాదవ్ ప్రతీక్ భార్యను లక్నో కంటోన్మెంట్ స్థానం నుండి పోటీ చేయిస్తున్నట్టు ప్రకటించడంతో ఈ అగ్నికి ఆగ్యం పోసింది. తన సవతి తల్లి తనను ఇబ్బందులు పెడుతోందని తన తండ్రికి లేనిపోనివి కల్పించి చెప్పి తనను దెబ్బతీసేందుకు ప్రయత్నాలు చేస్తోందని అఖిలేష్ సన్నిహితుల వద్ద వాపోయేవాడని రాజకీయ వర్గాల సమాచారం. దీనిపై కొంత మంది సమాజ్ వాదీ పార్టీ నేతలు బహిరంగంగా ప్రకటనలు కూడా చేయడంతో వీరి మద్య యుద్ధం తారా స్థాయికి చేరింది. తోడి కోడళ్ల మధ్య ఆదిపత్య  పోరు సవతి తల్లి, సోదరుడిపై అఖిలేష్ కు మధ్య ఉన్న విభేదాలతో ములాయం కుటుంబం నిట్టనిలువుగా చీలిపోయింది. ములాయం సోదరుల్లో అటు ఇద్దరు ఇటు ఇద్దరు చేరిపోయారు. మొత్తం మీద ఇంటి గుట్టు లంకకు చేటు అన్నట్టుగా ఇంటి పోరు సమాజ్ వాదీ పార్టీ ని ముంంచింది.
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *