టూవీలర్ అంబులెన్స్ లు రెడీ…

రోడ్డు ప్రమాదాలు, అత్యవసర సమయాల్లో ప్రాధమిక చికిత్స ఎంత త్వరగా అందితే ప్రమాద బారిన పడిన వారు అంత త్వరగా కోలుకునే అవకాశం ఉంది. అత్యవసర సమయాల్లో సమయం అత్యంత కీలకం. ఈ నేపధ్యంలో సత్వర చికిత్స కోసం తెలంగాణ వైద్య శాఖ ద్విచక్ర వాహనాలను సిద్ధం చేసింది. 108 వాహనాలు ప్రస్తుతం వేల సంఖ్యలో ప్రజల ప్రాణాలను నిల్పుతుండగా ఇప్పుడు 108 ద్విచక్ర వాహనాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. పెద్ద వాహనాలు వెళ్లలేని సమయాల్లో అందుబాటులోని సమయాలతో పాటుగా చిన్న చిన్న సందుల్లోకి సైతం వెళ్లేందుకు అనువుగా ఉన్న ఈ టూవీలర్ ఆంబులెన్స్ లో అత్యవసర కిట్ అందుబాటులో ఉంటుంది. నగరంలోని బస్తీలతో పాటుగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ ద్విచక్ర అంబులెన్స్ లు అత్యంత విపయోగకరంగా ఉంటాయని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *