పెద్ద నోట్లను రద్దు చేసిన ప్రభుత్వం వాటిని బ్యాంకుల్లో జమ చేసేందుకు విధించిన గడువు శుక్రవారం (డిసెంబరు 30)తో తీరిపోనుంది. దేశంలో ఉన్న నల్లధనంతో పాటుగా నకిలీ నోట్ల బెడదను నివారించేందుకు అంటూ కేంద్ర ప్రభుత్వం నవంబర్ 8వ తేదీన హఠాత్తుగా నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించింది. నోట్లను మార్చుకోవడానికి అవకాశం కల్పించడంతోపాటుగా డిసెంబరు 30 వరకు బ్యాంకుల్లో పాత నోట్లను జమ చేసుకునే అవకాశం కల్పించింది. బ్యాంకుల్లో పాత నోట్లను శుక్రవారం బ్యాంకు పనిదినాల వరకు స్వీకరిస్తారు. ఆ తరువాత మార్చి 30 వరకు రిజర్వు బ్యాంకుల్లో ఏర్పాటు చేసే ప్రత్యేక కౌంటర్లలో నగదును జమ చేసుకోవచ్చు. అయితే ఇన్ని రోజులు నగదును ఎందుకు జమ చేయలేదన్న దానిపై బ్యాంకు అధికారులకు వివరించాల్సి ఉంటుంది.
రద్దయిన పాత నోట్లను మార్చి 31వ తేదీ తరువాత కూడా ఉంచుకుంటే వారిపై చర్యలకు సిద్ధమవుతోంది ప్రభుత్వం. మార్చి 31వ తేదీ తరువాత నోట్లను ఉంచుకునే వారిని జైలుకు పంపే విధంగా చట్టంలో మార్పులు తీసుకుని వస్తున్నట్టు వార్తలు వచ్చినప్పటికీ జైలుకు కాకుండా జరిమానాతో సరిపెడుతున్నారు. నగదు ఉపసంహరణపై అమల్లో ఉన్న పరిమితుల పై రిజర్వ్ బ్యాంకు ఎటువంటి ప్రకటనలు చేయలేదు. పాత నోట్ల జమకు గడవు ముంగింపుకు వచ్చినా బ్యాంకుల నుండి నగదు ఉపసంహరణ పై విధించిన ఆంక్షలకు సబంధించి ఎటువంటి ప్రకటన చేయడం లేదు. ప్రస్తుతం అమల్లో ఉన్న పరిమితులు మరి కొంత కాలం పాటు కాగే అవకాశాలు ఉన్నట్టు భావిస్తున్నారు.
నగదు జమకు ఆఖరి రోజుల్లో బ్యాంకుల్లో విపరీతమైన రద్దీ ఉంటుందనే అంచానాలు తప్పాయి. ఆఖరి రోజుల్లో బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు పెద్ద సంఖ్యలో ఖాతారాదులు వస్తారనుకున్నా ఎవరూ పెద్దగా రావడం లేదని బ్యాంకు అధికారులు చెప్తున్నారు. అడపాదడపా ఒకరిద్దరు తప్ప డిపాజిట్ లకోసం ఎవరూ రావడం లేదని వారు చెప్తున్నరా. వచ్చిన వారు కూడా రెండు మూడు నోట్లు మినహా పెద్ద మొత్తంలో ఎవరూ డిపాజిట్ లు చేయడం లేదని బ్యాంకు అధికారులు వెళ్లడించారు.