విమర్శల వాన

అసెంబ్లీ సమావేశాలను విపక్షాలు బహిష్కరించడంపై అసెంబ్లీ బయట మాటల తూటాలు పేలాయి. అధికార విక్షాలు ఒకరు పై ఒకరు విమర్శల వర్షం కురిపించుకున్నారు. భూ నిర్వాసితుల చట్టసరవరణ బిల్లుపై సమగ్ర చర్చ జరగలేదని విపక్షాలకు సరిగా మాట్లాడే అవకాశం కల్పించలేదని ఆరోపిస్తూ  కాంగ్రెస్, టీడీపీ, సీపీఎంలు అసెంబ్లీ సమావేశాలను ఒక రోజుపాటు బహిష్కరించడంపై అధికార పక్షం మండిపడింది. ప్రతిపక్షాలు అసెంబ్లీని అవహేళన చేస్తున్నట్టుగా వారి చర్య కనిపిస్తోందని అధికార పార్టీ సభ్యులు మండిపడ్డారు. విపక్షాలకు మాట్లాడేందుకు అవకాశం కల్పిచడం లేదనే వాదన పూర్తిగా అర్థరహితమని వారంటున్నారు. భూసేకరణ చట్ట సవరణపై సమగ్ర చర్చ జరిగిందని ముఖ్యమంత్రి స్వయంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారని అయినా విపక్షాలు లేనిపోని రాద్దాంతం చేస్తున్నారని వారు మండిపడ్డారు.
ఇటు విపక్షాలు కూడా టీఆర్ఎస్ వైఖరిని తప్పుబడుతున్నాయి. అసెంబ్లీలో విపక్షాలకు మాట్లాడే అవకాశం కల్పించకుండా నిరంకుశంగా వ్యవహరిస్తున్న అధికార పక్షం ప్రజాస్వామ్య పూర్తికి విఘాతం కలిగిస్తోందంటూ విరుచుకుపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా విపక్షాల గొంతు నొక్కుతున్నారన్నారు. అత్యంత కీలకమైన నిర్వాసితుల చట్ట సవరణ బిల్లుపై సమగ్రంగా చర్చ జరగలేదని అధికార పక్షం తాను చెప్పదల్చుకున్నది చెప్పి విపక్షాలకు సరిగా మాట్లాడే అవకాశమే ఇవ్వడం లేదని ఆరోపించారు.
ఇటు నిర్వాసితుల చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా తెలంగాణ జేఏసీ తలపెట్టిన ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో దీక్షకు దిగిన కోదండరాంకు విపక్షాలన్నీ సంఘీభావం ప్రకటించాయి. విపక్ష నేతలంతా కోదండరాం చేస్తున్న దీక్షకు మద్దతు ప్రకటిస్తున్న చెప్పాయి. తెలంగాణ కోసం జరిగిన పోరాటంలో కీలకంగా వ్యవహరించిన కోదండరాం లాంటి వ్యక్తులకు కూడా ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితి వస్తుందని తాము అనుకోలేదని విపక్ష నేతలంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *