తెలంగాణ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తన నివాసంలో దీక్షకు దిగారు. భూ నిర్వాసితుల చట్టం 2013 కు జరిగిన సవరణలను వ్యతిరేకిస్తూ తెలంగాణ జేఏసీ నిర్వహించ తలపెట్టిన ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. పోలీసులు అనుమతి ఇవ్వకున్నా ధర్నా చేస్తామంటూ ప్రకటించిన జేఏసీ నేతలు హైదరాబాద్ కు వచ్చే ప్రయత్నం చేశారు. దీనితో పోలీసుల జేఏసీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేసిన కోందండరాం తన నివాసంలో దిక్షకు దిగారు. తమ ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వాలని అరెస్టు చేసిన జేఏసీ నేతలను, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని కోదండరాం డిమాండ్ చేశారు. నిర్వాసితుల సమస్యలపై పోరాడుతున్న తమ ఆందోళనను అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అంటున్నారు. కోదండరాం దీక్షతో తార్నాకాలోని ఆయన నివాసానికి జేఏసీ నేతలు, కార్యకర్తలు కొందరు చేరుకున్నారు. దీనితో పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.