చిన్నమ్మకే పార్టీ పగ్గాలు

అన్నా డీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆ పార్టీ దివంగత నేత జయలలిత సన్నిహితురాలు శశికళ ఎంపికయ్యారు. అన్నా డీఎంకే పార్టీ సర్వసభ్య సమావేశంలో శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. హై డ్రామా మద్య గురువారం జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో ప్రధాన కార్యదర్శిగా శశికళను ఎన్నుకునే తీర్మానాన్ని ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మొత్తం 23 మంది కలిసి ప్రతిపాదించారు. ఈ తీర్మానాన్ని సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. పార్టీ సర్వసభ్య సమావేశానికి అహ్వానం ఉన్న వారినే  అనుమతించారు. అహ్వానం లేని వారిని పోలీసులు బలవంతంగా బయటకు పంపారు.  తనకు వ్యతిరేకంగా ఉన్న వారికి అహ్వానాలు పంపకుండా శశికళ జాగ్రత్తలు తీసుకున్నట్టు సమాచారం. పార్టీ సమావేశాల్లో జయలలిత కోసం ప్రత్యేక కుర్చీని వేసి ఖాళీగా వదిలిపెట్టారు. ఇక ముందు జరిగే అన్ని సమావేశాల్లోనూ ఖాళీ కుర్చి జయ కోసం వేస్తున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. జయలలిత పార్టీకి శాశ్వత ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతారని సమావేశంలో ప్రకటించారు. అమ్మకు మృతికి పార్టీ నేతలు సంతాపం ప్రకటించారు.
తమిళనాడులో అధికార పార్టీ అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఇష్టసఖి శశికళ ఎన్నికయ్యారు. చెన్నైలో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో  సమావేశం అనంతరం ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, ఎమ్మెల్యేలు పోయెస్‌గార్డెన్‌కు వెళ్లి శశికళను పార్టీ బాధ్యతలు చేపట్టాల్సిందిగా కోరనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *