కుటుంబరావు "సినిమా" కష్టాలు

అభిమాన హీరో మీద ప్రేమతోనో లేక భార్యా పిల్లల కోరిక కాదనలేకో సినిమాకు వెళ్తామనుకునే కుటుంబరావుల జేబులకు చిల్లులు తప్పడం లేదు. మల్టీప్లెక్స్ లు వచ్చిన తరువాత సాధారణ సినిమా హాళ్లు పూర్తిగా తగ్గిపోయాయి. ఒకటీ అరా ఉన్నా వాటిల్లో మనకు కావాల్సిన సినిమాలు ఉండడం ేదు. మల్టిప్లెక్స్ లకు తప్ప సాధారణ సినిమాహాళ్లకు వెళ్లడం నేరం అన్నంతగా ప్రచారం జరగడంతో అక్కడ టికెట్ ధరలకు కళ్లు బైర్లు కమ్ముతున్నా అక్కడికే వెళ్లాల్సిన దుస్థితి. టికెట్ ధరకే సగం చచ్చిపోయిన సగటు కుటుంబరావు సినిమాకు బయలు దేరిన దగ్గర నుండీ దోపిడీ పర్వం మొదవుతోంది. సినిమా హాళ్లలో పార్కింగ్ తో దోపిడీల పర్వం మొదలవుతోంది. పార్కింగ్ చార్జ్ పేరుతో ఇచ్చే టికెట్ పై ముద్రించిన రేటుకు వసూలు చేసే రేటుకు ఎక్కడా పొంతన ఉండదు. కనిపించీ కనిపించనట్టు ఇచ్చే రసీదులో ఉన్న చార్జ్ కన్నా మూడు నుండి నాలుగు రెట్లు ఎక్కువ వసూలు చేస్తారు. ఇదేమని అడిగితే పార్కింగ్ సిబ్బంది మాకుమ్మడి దాడులు తప్పవు. “మీ కక్కూర్తి మండ అనే కుటుంబ సభ్యుల చూపులు” ఎక్కడికి వచ్చినా గొడవేనా అనే మాటలతో నోరుమూసుకుని సినిమా హాల్లోకి వెళ్లే కుటుంబరావులకు చెత్త సీట్లు స్వాగతం పలుకుతున్నాయి.  పైన పటారం హాళ్ళలో సౌకర్యాల పేరుతో జరుగుతున్న దోపిడీకి వాస్తవానికి కల్పిస్తున్న సౌకర్యాలకు అసలు పొంతనే లేదు.
సినిమా హాల్స్ అన్నీ షాపింగ్ మాల్స్ లాగా మారిపోయాయి. అద్దాల గ్లాసుల్లో అందమైన వస్తువులు(ముఖ్యంగా మహిళలు పిల్లలను ఆకర్షించేవి) బయటికన్నా ముడు నుండి నాలుగు రెట్ల అదిక ధరలకు అమ్ముతున్నారు. ఇదే మని అడిగే ధైర్యం చేసేవాళేవరూ కనిపించరు. రోడ్డుపక్కన కూరమల్లే ముసలావిడ వద్ద రూపాయ కరివేపాకు కోసం అర్థగంట వాదించే వారు కూడా ఇక్కడ వాళ్లు అడినంతా ఇచ్చి చేతులు దులుపుకోవడం తప్ప వేరే మార్గం లేదు. అవుట్ సైడ్ ఫుడ్ నా అలౌడ్ అంటూ పెద్ద పెద్ద బోర్డులు పెట్టి మరీ నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇంటి నుండి ఏమీ తెచ్చుకునే వీలు లేదు. ఇక్కడ కొనుక్కోవాలంటే రేటు చూస్తే గొంతు దిగదు . సినిమా హాళ్లలో వాళ్లు చెప్పిందే రేటు. దీనిపై ఎవరికి నియంత్రణ ఉందో తెలీదు. వంద రూపాయలకు దోసెడు పాప్ కార్న్ ఇచ్చినా కిమ్మన కుండా తీసుకుని రావాల్సిందే. ఇంటర్వెల్ వస్తుందంటే పాపం కుటుంబరావుల గుండెలు గుభేలు మంటున్నాయి. సినిమా మొదలు కావడానికి ముందు తిరు క్షవరం అయితే ఇక ఇంటర్వేల్ లో నిలువు దోపిడేనే. సినిమా హాళ్లలోని తినుబండారాలకు వసూలు చేస్తున్న ధరలు నిజంగానే దిమ్మతిరిగేలా ఉంటున్నాయి. ఎంఆర్పీ ఉన్న వస్తువులను సైతం ఇష్టం వచ్చిన రేట్లకు అమ్ముతున్నారు. ఏదేమని అడిగే సాహసం చేయం. అడిగితే పక్కనున్నవాడు తొందరగా కదులు అంటూ కసురు కుంటే మరొకరు మన వైపు కల్చర్ తెలీని వాళ్లంటూ జాలి చూపులు చూస్తుంటారు. తిరుక్షవరం, నిలువు దోపిడీ తరువాత అభిమాన హీరో గారి డైలాగులు కానీ, హీరోయిన్ ల అందచందాలు కానీ అప్పటికే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయిన  మన కుటుంబరావు గారికి కనిపించవు.సినిమా అయి పోగానే బయటకు వచ్చేసిన తరువాత ఈ సినిమా బాలేదు కానీ వచ్చేవారం మంచి సినిమా వస్తుందట అన్న మాటలకు భార్యా పిల్లల మాటలకు పిచ్చి నవ్వులు, బిత్తర చూపులే….
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *