పతాంజలి పై కార్పోరేట్ యుద్ధం

భారతీయ కన్జూమర్ మార్కెట్ లో పంతాంజలి గ్రూప్ సృష్టిస్తున్న సునామీని తట్టుకునేందుకు విదేశీ సంస్థలు కూడా కొత్త వ్యూహంతో ముందుకు వస్తున్నాయి. పతాంజలి ఉత్పత్తులపై కార్పోరేట్ యుద్ధానికి హిందుస్తాన్ యూనీలీవర్ సంస్థ సిద్ధమవుతోంది,  వీదేశీ సంస్థలు కూడా ఇప్పుడు ఆయుద్వేద జపం చేస్తున్నాయి. దేశీయ ఉత్పత్తులను, ఆయుద్వేద ఉత్పత్తులను నిర్లక్షం చేస్తూ వచ్చిన విదేశీ సంస్థలు ఇప్పుడు ఆయుద్వేద ఉత్పత్తుల వైపు దృష్టిపెడుతున్నాయి. స్వదేశీ ఉత్పత్తులతో సంచలనం సృష్టిస్తూ దేశీయ మార్కెట్ లో సాలీనా 5వేల కోట్ల టర్నోవర్ ను సాధిస్తుండడంతో విదేశీ సంస్థల నోట్లో పచ్చి వెల్లక్కాయపడింది. దీనితో పతాంజలి పోటీని తట్టుకునేందుకు హిందుస్తాన్ యూనీలీవర్ కూడా ఆయుద్వేద బాటపడ్డింది. టూత్పేస్ట్, స్కిన్ కేర్ నుంచి సోప్స్, షాంపుల వరకు దాదాపు 20 ఉత్పత్తులను ప్రస్తుత ఆయుర్వేద బ్రాండు ఆయుష్లో లాంచ్ చేయనున్నట్టు తెలిపింది.  ఈ బ్రాండుపై విడుదల చేసే ఆయుర్వేద ఉత్పత్తులను ధరలు రూ.30 నుంచి రూ.130 పరిధిలో ఉండేలా కంపెనీ చర్యలు తీసుకుంటోంది. హెచ్యూల్ పర్సనల్ కేర్ బిజినెస్లు దాన్ని విక్రయాల్లో దాదాపు సగం శాతం ఉంటాయి. వాటినుంచే 60 శాతం లాభాలను కంపెనీ ఆర్జిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *