దొంగలకు ప్రధాని కొమ్ముకాస్తున్నారు:రాహుల్

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దొంగలకు, దేశ ద్రోహులకు కొమ్ముకాస్తుననారని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా రాహుల్ మీడియాతో మాట్లాడురు.  భారత్ నుండి తరలిపోయిన నల్ల ధనాన్ని వెనక్కి తీసుకుని వస్తానంటూ పెద్ద మాటలు చెప్పిన ప్రధాని ఇప్పుడు దిని గురించి మాట్లాడడమే మానేశారని  విమర్శించారు. స్వీస్ బ్యాంకుల్లో ఖాతాలకు సంబంధించి అక్కడి బ్యాంకులు ఖాతాదారుల వివరాలను కేంద్ర ప్రభుత్వానికి అందచేశాయని మరి ఆ వివరాలను మోడీ ఎందుకు వెల్లడించడం లేదని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. స్విస్ బ్యాంకు ఖాతారాల వివరాలను వెళ్లడించకుండా మోడీ ఇతరుల పై విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. అసలు దొంగలను వెనకేసుకుని వస్తోంది ఎవరో ఇప్పుడు ప్రపంచానికి తెలిసిపోయిందన్నారు.
తన మాటకారి తనంతో విపక్షాల నోరు మూయించాలని మోడీ ప్రయత్నిస్తున్నారని ఆయన ఆటలు ఎన్నోరోజులు సాగవని రాహుల్ అన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల లాభ పడింది కేవలం కొంత బడాబాబులేనని కోట్లాది మంది పేద ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారని చెప్పారు. పెద్ద నోట్ల రద్దును ఒక యజ్ఞం అంటూ చెప్పుకొస్తున్న మోడీ యజ్ఞంలో బడుగుజీవులను బలిగా ఇచ్చారని మండిపడ్డారు. నోట్ల రద్దు వల్ల పేద ప్రజలు, చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని వారిని పట్టించుకునే తీరిక ప్రధానికి లేదని రాహుల్ విమర్శించారు. కొంత మంది పెద్దలకోసం దేశవ్యాప్తంగా పేదలను కష్టాలు పెడుతున్న ప్రధానికి ప్రజలే బుద్దిచెప్తారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *