హైదరాబాద్ లో ఉచిత వైఫై

హైదరాబాద్ ప్రజలకు మరో అద్భతమైన సౌకర్యం త్వరలో చేరువ కానుంది. నగర వ్యయాప్తంగా ఉచితంగా వై.ఫై సౌకర్యం కల్పించే దిశగా అడుగులు పడుతున్నాయి. దీనితో నగర వ్యాప్తంగా పూర్తిగా ఉచితంగా ప్రజలకు వై.ఫై సేవలు అందుతాయి. ఇదే జరిగితే    దేశంలోనే తొలి పూర్తి స్థారుు వై ఫై మహా నగరంగా హైదరాబాద్ పేరు పొందనుంది.  ఈ ఉచిత వైఫై సేవలను ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ అందిచనుంది.  దీనికోసం గాను సొంతంగా హాట్‌స్పాట్స్ ఏర్పాటు చేయాలని నిర్ణరుుంచింది. ఇప్పటికే టెండర్ ప్రక్రియను సైతం పూర్తి చేసింది. ఇప్పటి వరకు క్వాడ్జన్ సంస్థ ఒప్పందంతో సుమారు 49 హాట్ స్పాట్స్‌లను ఏర్పాటు చేసి ఉచిత వై ఫై సేవలు అందిస్తోంది. తాజాగా  150 వైఫై హాట్‌స్పాట్స్ ఏర్పాటు చేసి సేవలు విస్తరించాలని సంకల్పించింది. వైఫై హాట్‌స్పాట్స్ ద్వారా వినియోగదారులు 2 నుంచి 10 ఎంబీపీఎస్ వరకు డాటాను డౌన్‌లోడ్ చేసుకునేందుకు వెసులుబాటు కలగనుంది.బీఎస్‌ఎన్‌ఎల్ మొబైల్ 3 జీ  వినియోగదారులకు ఉచిత వై ఫై టవర్ మరింత వెసులు బాటుగా మారింది. హాట్ స్పాట్స్ టవర్ పరిధిలోకి మొబైల్ రాగానే మొబైల్ డాటా అటో మెటిక్‌గా ఆఫ్ అరుు ఉచిత వైఫై డాటా వినియోగంలోకి వస్తుంది.
బీఎస్‌ఎన్‌ఎల్ హాట్ స్పాట్స్ ద్వారా వైఫై సేవలను వినియోగదారులు ఒక మొబైల్ ద్వారా 15 నిమిషాల పాటు ఉచితంగా వినియోగించుకోవచ్చు. ఆ తర్వాత వోచర్ బేస్ట్ సర్వీసెస్, ఈ-వోచర్  బెస్ట్ సర్వీసెస్ అందుబాటులో ఉంటారుు.  ఈ వోచర్స్ కోసం డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులను వినియోగించవచ్చు. ఈ సర్వీసులను తక్కువ రేట్లకు బీఎస్‌ఎన్‌ఎల్ అందుబాటులో ఉంచింది. ఈ సౌకర్యాన్ని ప్రజలకు మార్చి నాటికల్లా అందుబాటులోతి తీసుకుని వచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయిందని వీలైనంత త్వరగా గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు ఉచితంగా వై.ఫై సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకుని వస్తామని బీఎస్ఎన్ఎల్ అధికారులు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *