షష్టి పూర్తి 60 వ సం౹౹లొనే ఎందుకు జరుపుకుంటారు….

మీరు ఏ సంవ‌త్స‌రంలో పుట్టారు అని అడిగితే ఠ‌క్కున 1985 అనో 1996 అనో చెప్పేస్తారు…. కానీ, ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారు అంటే … మన దగ్గర నుండి సమాధానం రాదు…. ఎందు కంటే మనం తెలుగు వాళ్ళం…. తెలుగు సంవత్సరాలు 60 ఉంటాయని ఎంత మందికి తెలుసో మనకు తెలియదు….. తెలిసినా 60 సంవత్సరాలు వరుసగా చెప్పే జ్ఞాపక శక్తి గాని తీరిక గాని మనకు లేవు,ఎందుకంటే మనం అచ్చమైన తెలుగు
వాళ్ళం…. అన్ని చెప్పలేక పోయిన కనీసం మీరు ఏ తెలుగు సంవత్సరం లో పుట్టారో తెలుసుకోవడం కోసం ఆ తెలుగు సంవ‌త్స‌రాల వివరాలు క్రింద ఇస్తున్నాం …
ఇక్కడ మీకో ముఖ్యమైన సంగతి మరొకటి చెప్పాలి. నిజానికి మనం
ఏ తెలుగు సంవత్సరంలో పుట్టామో అదే సంవత్సరం లో మన పుట్టిన రోజును జరుపుకోవాలంటే మన జీవితం లో ఒక్క సారే జరుపు కోగలం…
రెండవ సారి జరుపు కోవాలంటే 120 వ సంవత్సరం వరకు ఆగాలి….
ఆది జరిగే పని కాదు…. అయితే మనలో చాలా మందికి తెలియకుండానే
మనం పుట్టిన తెలుగు సంవత్సరాన్ని అనగా మొదటి పుట్టిన రోజును షష్టి పూర్తి గా 60 వ సంవత్సరం లో జరుపుకుంటున్నాము.

1927, 1987, 2047, 2107 : ప్రభవ
1928, 1988, 2048, 2108 : విభవ
1929, 1989, 2049, 2109 : శుక్ల
1930, 1990, 2050, 2110 : ప్రమోదూత
1931, 1991, 2051, 2111 : ప్రజోత్పత్తి
1932, 1992, 2052, 2112 : అంగీరస
1933, 1993, 2053, 2113 : శ్రీముఖ
1934, 1994, 2054, 2114 : భావ
1935, 1995, 2055, 2115 : యువ
1936, 1996, 2056, 2116 : ధాత
1937, 1997, 2057, 2117 : ఈశ్వర
1938, 1998, 2058, 2118 : బహుధాన్య
1939, 1999, 2059, 2119 : ప్రమాది
1940, 2000, 2060, 2120 : విక్రమ
1941, 2001, 2061, 2121 : వృష
1942, 2002, 2062, 2122 : చిత్రభాను
1943, 2003, 2063, 2123 : స్వభాను
1944, 2004, 2064, 2124 : తారణ
1945, 2005, 2065, 2125 : పార్థివ
1946, 2006, 2066, 2126 : వ్యయ
1947, 2007, 2067, 2127 : సర్వజిత్
1948, 2008, 2068, 2128 : సర్వదారి
1949, 2009, 2069, 2129 : విరోది
1950, 2010, 2070, 2130 : వికృతి
1951, 2011, 2071, 2131 : ఖర
1952, 2012, 2072, 2132 : నందన
1953, 2013, 2073, 2133 : విజయ
1954, 2014, 2074, 2134 : జయ
1955, 2015, 2075, 2135 : మన్మద
1956, 2016, 2076, 2136 : దుర్ముఖి
1957, 2017, 2077, 2137 : హేవిళంబి
1958, 2018, 2078, 2138 : విళంబి
1959, 2019, 2079, 2139 : వికారి
1960, 2020, 2080, 2140 : శార్వరి
1961, 2021, 2081, 2141 : ప్లవ
1962, 2022, 2082, 2142 : శుభకృత్
1963, 2023, 2083, 2143 : శోభకృత్
1964, 2024, 2084, 2144 : క్రోది
1965, 2025, 2085, 2145 : విశ్వావసు
1966, 2026, 2086, 2146 : పరాభవ
1967, 2027, 2087, 2147 : ప్లవంగ
1968, 2028, 2088, 2148 : కీలక
1969, 2029, 2089, 2149 : సౌమ్య
1970, 2030, 2090, 2150 : సాధారణ
1971, 2031, 2091, 2151 : విరోదికృత్
1972, 2032, 2092, 2152 : పరీదావి
1973, 2033, 2093, 2153 : ప్రమాది
1974, 2034, 2094, 2154 : ఆనంద
1975, 2035, 2095, 2155 : రాక్షస
1976, 2036, 2096, 2156 : నల
1977, 2037, 2097, 2157 : పింగళ
1978, 2038, 2098, 2158 : కాళయుక్తి
1979, 2039, 2099, 2159 : సిద్దార్థి
1980, 2040, 2100, 2160 : రౌద్రి
1981, 2041, 2101, 2161 : దుర్మతి
1982, 2042, 2102, 2162 : దుందుభి
1983, 2043, 2103, 2163 : రుదిరోద్గారి
1984, 2044, 2104, 2164 : రక్తాక్షి
1985, 2045, 2105, 2165 : క్రోదన
1986, 2046, 2106, 2166 : అక్షయ

థేరం ఫణికుమార్ శర్మ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *