శశికళపై జయలలిత మేనకోడలు ధ్వజం

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతిపై విషయంలో అనేక అనుమానులున్నాయని వాటిని త్వరలోనే బయటపెడతానని జయలలిత అన్న కుమారై దీప అన్నారు. జయలలిత అంత్యక్రియల తరువాత మీడియాలో ముందుకు వచ్చిన దీప ఆసుపత్రిలో ఉన్న తమ మేనత్తును చూసేందుకు తాను ఎన్నిసార్లు ప్రయత్నాలు చేసినా తనకు చూసే అవకాశం లభించలేదని ధ్వజమెత్తారు. తాను చాలా సార్లు తన అత్తకు దగ్గర కావాలని ప్రయత్నాలు చేసిన అమెను అంటిపెట్టుకుని ఉన్న కోటరీ తనను అమె దగ్గరకు చేరనీయంకుండా చేశారని శశికళపై విరుచుకు పడ్డారు. తన మేనత్త అంత్యక్రియలను శశికళ నిర్వహించడం పై కూడా దీప అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక మహిళ అంత్యక్రియలు నిర్వహించడం ఏమిటని ఆమె ప్రశ్నించారు.

దీప మీడియా ముందుకు వచ్చి శశికళపై నేరుగా విమర్శలు చేయడంతో తమిళనాడులో వారసత్వ రాజకీయాలు మరింత రసకందాయంలో పడే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో దీప జయలలితకు చేరువ కావడానికి చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. గతంలో దీప తండ్రి జయకుమార్ జయలలితో పాటే నివాసం ఉంటూ వచ్చినా ఆ తరువాత వారి మధ్య విభేదాలు పొడచూపాయి. దీనితో జయకుమార్ జయలలిత ఇంటి నుండి బయటకు వచ్చేయాల్సి వచ్చింది.

1995లో జయకుమార్ మృతి చెందగా జయలలిత ఇంటికి వెళ్లి పరామర్శించి వచ్చారు. 2013లో వదిన చనిపోయినపుడు మాత్రం జయలలిత వెళ్లలేదు. ఇటీవల జరిగిన మేనకోడలు దీప వివాహానికీ  కూడా జయ హాజరు కాలేదు. దీంతో వధూవరులే జయలలిత ఇంటికి వెళ్లి ఆశీర్వాదం పొంది వచ్చారు.