వింత జంతువు వీడియో నిజంకాదని తేలింది. కేరళ, కర్ణాటక సరిహద్దుల్లో ఒక వింత జంతువు కనిపించిందని మనుషులతో సహా అన్ని రకాల జంతువులను తింటోందంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న వీడియో నిజం కాదని తేలింది. దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం అయిన సదర వీడియో వాస్తవానికి మలేషియాకు చెందినది. సంవత్సరం ముందరిది. మలేషియాలో ఎక్కువగా కనిపించే ఎలుగుబంటికి సంబంధించిన వీడియో అది. సదరు ఎగులు బంటికి వచ్చిన వ్యాధి వల్ల అది ఆ విధంగా వింత ఆకారంలో తయారయింది. అక్కడి స్థానికులు కూడా దీన్ని గ్రహాంతర వాసిగా తొలుత అపోహ పడ్డారు. చివరికి వైధ్యులు దానిని ఎలుగుబంటిగా నిర్థారించారు.
- ప్రచారం అవుతున్నది జబ్బున పడ్డ ఎలుగుబంటి
- మలేషియాకు చెందిన ఈ వీడియో సంవత్సరం నాటిది
- మలేషియాలో కూడా గ్రహాంతర వాసిగా అనుమాన పడ్డ ప్రజలు
- కేరళ, కర్నటక సరిహద్దుల్లో బయటపడ్డ కొత్త జంతువంటూ ప్రచారం
- మనుషులతో సహా జంతువులను తింటోందని సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియో
- నాలుగు జంతువులు ఉండగా ఒకటే దొరికిందని వార్తలు
- వింత జంతువు వార్తలు నిజం కాదని చెప్పిన అధికారులు.