రు.కోటికి 25లక్షల కమీషన్

కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంతో భారీగా లెక్కలు చూపని నగదును పోగు చేసుకున్న పెద్ద మనుషులకు నిద్ర లేకుండా పోతోంది. తమ దగ్గర ఉన్న డబ్బును ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వదిలించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎంత కమిషన్ అయినా ఇచ్చేందుకు సిద్ధపడుతున్నరు. పూర్తిగా పోయే దానికన్న కనీసం కొంతైనా దక్కుతుందనే ఆశతో 25శాతం కమిషన్ ను ఇచ్చేందుకు కూడా సిద్ధ పడుతున్నారు. ఇట్లా పూణేలో ఒక వ్యాపారి కోటీ రూపాయలకు 25 లక్షల కమిషన్ పద్దతిలో మార్చుకునేందుకు ప్రయత్నిస్తూ పోలీసులకు పట్టుపడ్డాడు.  పోలీసులు, ఐటీ అధికారులు దాడి చేసి 1.12 కోట‍్ల రూపాయల విలువైన పాత కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. భరత్‌ షా అనే వ్యాపారవేత్త తన దగ్గర ఉన్న పాతనోట్లను మార్చుకునేందుకు ఏజెంట్లతో ఒప్పందం చేసుకున్నాడు.  పుణెలోని ఎంజీ రోడ్డులో ఏజెంట్లను కలిసేందుకు ప్రయత్నించాడు. పోలీసులు, ఐటీ అధికారులు.. భరత్‌ షాను అదుపులోకి తీసుకుని నోట్లను స్వాధీనం చేసుకున్నారు. 500 నోట్లు 22444, 1000 నోట్లు 28 ఉన్నట్టు గుర్తించారు. అయితే ఈ డబ్బును తాను కష్టపడి సంపాదించుకున్నానని ఒకే సారి నోట్లను రద్దు చేయడంతో తమ లాంటి వారు చాలా నష్టపోతున్నారంటూ వ్యాపారి చెప్పడం కొసమెరుపు.